పోలీసులా..తెదేపా కార్యకర్తలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీసులా..తెదేపా కార్యకర్తలా..

పోలీసులా..తెదేపా కార్యకర్తలా..

Written By news on Friday, July 24, 2015 | 7/24/2015


పోలీసులా..తెదేపా కార్యకర్తలా..
రాజుపాలెం : వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు మర్రి వెంకట్రామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలను గురువారం పోలీసులు అరెస్టు చేయటంతో విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులులు రాజుపాలెం పోలీస్ స్టేషన్‌కు వచ్చి జంగాను, జెడ్పీటీసీని, నాయకులను పరామర్శించారు. అనంతరం పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డిని కలసి వారిని అరెస్టు చేయటానికి గల కారణాలు చూపించాలని అడిగారు. శాంతియుతంగా కాలి నడకన వెళ్తున్న కృష్ణమూర్తిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు.

శాంతి భద్రతల దృష్ట్యా అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అరాచకాలు చేస్తున్న ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోవటం దారుణం అన్నారు. కోనా రఘుపతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కృష్ణమూర్తికి ఒక సామాజిక వర్గం ఉందని తెలిసి కూడా అరెష్టు చేయడం అగ్గి మీద కిరోసిన్ పోసినట్లు ఉందని పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి పోలీసులు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని, అధికారం ఒకరి సొత్తు కాదని తెలుసుకోవాలన్నారు.

జిల్లా సేవాదళ్ అధ్యక్షులు చిన్నప్పరెడ్డి, పిడుగురాళ్ల , దాచేపల్లి జెడ్పీటీసీలు వీరబద్దుని రామిరెడ్డి, ములుగొండ ప్రకాష్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ మాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మొగిలి మధుసూదన్‌రావు, బీసీ సెల్ రాష్ట్ర సభ్యులు కోడిరెక్క దేవదాసు, జిల్లా సంయుక్త కార్యదర్శి తాటికొండ చిన్న ఆంజనేయులురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, రాష్ట్ర విభజన అధ్యక్షులు కొఠారి నరసింహారావు, రాష్ట్ర బీసీ కార్యవర్గ సభ్యులు కుందుర్తి గురవాచారి, బీసీ సెల్ సభ్యులు దూదేకుల మీరావలి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: