దద్దమ్మ ప్రభుత్వాన్ని సాగనంపుదాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దద్దమ్మ ప్రభుత్వాన్ని సాగనంపుదాం

దద్దమ్మ ప్రభుత్వాన్ని సాగనంపుదాం

Written By news on Tuesday, July 28, 2015 | 7/28/2015


దద్దమ్మ ప్రభుత్వాన్ని సాగనంపుదాం
ఉమ్మారెడ్డి సన్మాన సభలో టీడీపీపై నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ నేతలు
 

బాపట్ల: రాష్ట్రంలో దద్దమ్మ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారనీ, ఏడాది కాలంలోనే అధికారపార్టీపై వ్యతిరేకత పెల్లుబుకుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును సోమవారం బాపట్లలో ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సభకు భారీగా జనం తరలిరావడంతో భావపురి వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా రథం బజారు సెంటర్ జనసంద్రంగా మారింది. సభలో పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి పార్థసారధి మాట్లాడుతూ రాష్ట్రంలో దద్దమ్మ ప్రభుత్వం పరిపాలన చేస్తోందన్నారు. రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాట తప్పడంతో ప్రస్తుతం రైతులు, మహిళలు బ్యాంకుల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి :
రాష్ట్రంలో అరాచకశక్తులు పేట్రేగిపోతున్నాయి. ప్రజల సొమ్మును దండుకొనేందుకే టీడీపీ ప్రభుత్వం పని చేస్తోంది. రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పత్తి వ్యాపారం చేస్తూ రైతుల నుంచి రూ.2వేలకు కొనుగోలు చేసి రూ.3500 అమ్ముకుంటున్నారు. - వైఎస్సార్ సీపీ నేత బొత్స

 అన్నిశాఖల్లో అవినీతి పేరుకుపోయింది
 ప్రభుత్వ శాఖల్లో అవినీతి విలయతాండవం చేస్తోందని సన్మాన గ్రహీత డాక్టరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు సకాలంలో పంటలు వేసుకోలేక, పండించిన పంటకు గిట్టుబాటుధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అభివృద్ధే లక్ష్యం -ఎమ్మెల్యే కోన రఘుపతి

నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు. ప్రజా బలం ఉన్నంత కాలంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ తిరుగులేని నాయకునిగా ఉంటా. కుట్రలు, కుతంత్రాలు గురించి ఆలోచించే వ్యక్తిని కాదు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నా. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, యువజన నేత కావటి మనోహర్‌నాయుడు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, వరికూటి అమృతపాణి, కొత్త చిన్నపరెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరరావు, కోకి రాఘవరెడ్డి, దొంతిబో యిన సీతారామిరెడ్డి, షేక్.బాజీ, కర్లపాలెం ఎంపీపీ ఎం. వెంకటరత్నం, జడ్‌పిటిసిలు వడ్డిముక్కల డేవిడ్ రత్నమణి, చిరసాని నారపరెడ్డి, గుంపుల కన్నయ్య ఉన్నారు.
 
జగన్ అధికారంలోకి రావాల్సిందే..
నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాల్సిందేనని ఆ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముష్కరుల పాలన కొనసాగుతుందన్నారు. ముష్కరుడైన చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రకృతి కూడా విలయతాండవం చేస్తోందనడానికి గోదావరి పుష్కరాల్లో ఆశువులుబాసిన మృతులే నిలువెత్తు నిదర్శనమన్నారు.
 -రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 
Share this article :

0 comments: