చంద్రబాబు పిచ్చి కారణంగానే ప్రమాదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు పిచ్చి కారణంగానే ప్రమాదం

చంద్రబాబు పిచ్చి కారణంగానే ప్రమాదం

Written By news on Wednesday, July 15, 2015 | 7/15/2015


'చంద్రబాబు పిచ్చి కారణంగానే ప్రమాదం'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాజమండ్రి పుష్కర ఘాట్ లో తొక్కిసలాట జరిగిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ దుర్ఘటనకు సీఎం చంద్రబాబుదే బాధ్యత అని అన్నారు. చంద్రబాబుకు ఉన్న ప్రచార యావ కారణంగానే ఈ దారుణ ఘటన జరిగిందని దుయ్యట్టారు. బుధవారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే...

* చంద్రబాబు పూజలు చేస్తున్న సమయంలోనే లక్షల మంది బయట వేచి చూస్తున్నారు.
సీఎం ఘాట్ కు వచ్చేటప్పటికే జనం కిక్కిరిసి ఉన్నారు
ప్రభుత్వమే కావాలనే భక్తులందరినీ ఒకే ఘాటుకు తరలించింది
భక్తులు తమంతట తామే అక్కడికి వచ్చారని తప్పుదారి పట్టిస్తున్నారు
సీఎం పూజ చేస్తున్న సమయానికి జనం పోటెత్తారని చెప్పడానికే ఇదంతా చేశారు
లఘుచిత్రం కోసం ఫోటోలు తీసుకునేందుకే ఇలా చేశారు
ఫోటోలు బాగా రావాలన్న ఆలోచనతో భక్తుల భద్రతను గాలికి వదిలేశారు
భారీ జనసందోహం కనబడే దాకా సీఎం పూజ కార్యక్రమం నిర్వహించారు
మూడు గంటల పాటు జనాన్ని పుష్కర ఘాట్ బయట ఆపేశారు
ప్రచార యావతో జరిగిన తప్పిదం ఇది
ప్రభుత్వ నిర్లక్ష్యంగానే ప్రాణనష్టం జరిగింది
చంద్రబాబు పిచ్చిని ప్రజలు గమనిస్తున్నారు
బాబుకు మీడియా పిచ్చి, ప్రచార పిచ్చి ఉంది
తన వల్ల తప్పు జరిగినందుకు సీఎం క్షమాపణ చెప్పారా?
తన వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పుకుంటే ఏమౌతుంది?
చంద్రబాబు కంటతడి పెట్టారని మీడియా సలహాదారు చెబుతారు
చంద్రబాబు ప్రతిదీ మేనేజ్ చేయాలనుకుంటారు
న్యాయవిచారణకు ఆదేశించే నైతిక చంద్రబాబుకు ఎక్కడుంది
చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారా, లేదా?
తొక్కిసలాట ఘటనపై సమగ్ర నివేదిక ప్రభుత్వం వద్ద లేకపోవడం దారుణం
తొక్కిసలాట ఘటన బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కాలనుకున్నారు
తొక్కిసలాట దృశ్యాలు బయటకు రాకుండా చేశారు.
Share this article :

0 comments: