బాబును నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబును నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే

బాబును నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే

Written By news on Friday, July 3, 2015 | 7/03/2015


బాబును నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
అనంతపురం : హంద్రీ - నీవా ప్రాజెక్టు అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నిలదీశారు. జీడిపల్లి రిజర్వాయర్ వద్ద శుక్రవారం ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో బాబు సమీక్ష నిర్వహించారు. హంద్రీ - నీవా ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సీఎం ఆదేశించారు.

గతేడాది ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురానికి కేవలం 15 టీఎంసీల నీరే వచ్చిందని, ఒక్కో టీఎంసీకి రూ.15 కోట్లు ఖర్చు చేశారని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. అయితే జిల్లాకు వచ్చిన నీటిని ఎందుకు దుర్వినియోగం చేశారో చెప్పాలని సీఎం బాబును వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నిలదీశారు. జిల్లాలో 3.5 లక్షల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అవసరాలు తీరిన తర్వాతే నీరు తీసుకెళ్లాలని బాబుకు ఆయన స్పష్టం చేశారు.
Share this article :

0 comments: