ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ

Written By news on Friday, July 24, 2015 | 7/24/2015


ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
పట్నంబజారు(గుంటూరు) : 
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నిప్పులు చెరిగారు. గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న దురాగతాలను తెలియపరిచేందుకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న పార్టీ నేత జంగా కృష్ణమూర్తి విషయంలో పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

గురజాల నియోజకవర్గంలో ఎమర్జెన్సీ పెట్టిన విధంగా పరిణామాలు ఉన్నాయని మండిపడ్డారు. అరండల్‌పేటలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి విషయాలను వెల్లడించేందుకు బయలుదేరిన జంగాను బుధవారం ఒకసారి, గురువారం బెల్లకొండ వద్ద మరోసారి అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.

యరపతినేని చేస్తున్న మైనింగ్ మాఫియా, ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్న విషయాన్ని సంబంధిత ఆర్డీవో, తహశీల్దార్‌లకు చెప్పినప్పటికీ ప్రశ్నించే హక్కు లేదన్న చందం గా వ్యవహరిస్తున్నారన్నారు. జంగాను అక్రమం గా నిర్బంధించినంత మాత్రాన నిజాలు దాగవ న్న  విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ అక్రమాలను అడ్డుకోవడంతో పాటు, జంగాకు అండగా పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ అధికార పార్టీ దురాగతాలను ఎండగట్టేందుకు ఎంతటి పోరాటాలకైనా వెనుకాడమని హెచ్చరించారు. పార్టీ నగరాధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఖాకీ చొక్కాలు విప్పేసి, పచ్చ చొక్కాలు వేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జంగా ఆరోగ్యం సరిగాలేదని తెలిసినా, అరెస్ట్ చేయించడం టీడీపీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.  సమావేశంలో వైఎస్సార్‌సీపీ పలు విభాగాల నేతలు ఆతుకూరి ఆంజనేయులు, ఎండీ నసీర్‌అహ్మద్, అంగడి శ్రీనివాసరావు, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, సయ్యద్ మాబు, బండారు సాయిబాబు, యేళ్ళ జయలక్ష్మి, కొలకలూరి కోటేశ్వరరావు, మండేపూడి పురుషోత్తం, అత్తోట జోసఫ్, ఆవుల సుందర్‌రెడ్డి, నిమ్మరాజు శారదాలక్ష్మి, దేవరాజు, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, గనిక ఝాన్సీరాణి, ఉప్పుటూరి నర్సిరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.
Share this article :

0 comments: