వైఎస్ జగన్ దిగ్భ్రాంతి, హుటాహుటిన రాజమండ్రి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ దిగ్భ్రాంతి, హుటాహుటిన రాజమండ్రి

వైఎస్ జగన్ దిగ్భ్రాంతి, హుటాహుటిన రాజమండ్రి

Written By news on Tuesday, July 14, 2015 | 7/14/2015

రాజమండ్రి పుష్కరఘాట్లో తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ హుటాహుటిన రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం 1.30 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 25 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారు. గోదావరి పుష్కరాలు ఈరోజు నుంచి  ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: