ఇఫ్తార్ విందు మత సామరస్యానికి చిహ్నం: ముమ్మడి బాలిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇఫ్తార్ విందు మత సామరస్యానికి చిహ్నం: ముమ్మడి బాలిరెడ్డి

ఇఫ్తార్ విందు మత సామరస్యానికి చిహ్నం: ముమ్మడి బాలిరెడ్డి

Written By news on Wednesday, July 15, 2015 | 7/15/2015
కువైట్: కువైట్ మాలియా ప్రాంతములో ఉన్న మ్యాక్స్ హోటల్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ యం. బాలిరెడ్డి ఆధ్వర్యములో ఇఫ్తార్ విందు భారీగా ఎర్పాటు చేశారు. ఈ సందర్భముగా బాలిరెడ్డి  మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకు ప్రత్యేకత ఉందని భారత దేశంలో వివిధ కులాలు మతాలు ఉన్నా మేమంతా ఒక్కటే అని చాటి చెప్పేందుకు ఇఫ్తార్ విందు ఒక మంచి అవకాశామన్నారు.పవిత్ర రంజాన్ మాసం పుణ్యాల రాజ మార్గమని ఉపావాసము ద్వారా పేద వారి ఆకలి తెలిసి వారి ఆకలి తిర్చేదానికి సహాయం చేయాలనే మంచి అలోచన కలుగుతుందన్నారు.

కడప ఇస్లామిక్ సొసైటి కువైట్ అధ్యక్షులు సయ్యద్ అజీస్ ఖాద్రి గారు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కుల మతాలకు అతీతంగా సేవ  చేయడం అభినందనియమని కువైట్ లో ఉన్న తెలుగు వారి సమస్యల కొరకు కమిటి ఎర్పాటు చేసినందుకు కృతఙ్ఞతలు తెలియ చేశారు. గోదావరి పుష్కరాల మృతులకు ఘన నివాళి  అర్పించి గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని 
షేక్ షావలి ప్రార్ధన  చేశారు .
ఈ కార్యక్రమములో కో కన్వినర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రేహామాన్ ఖాన్, నాయని మహేష్, మీడియా టీం లీడర్ ఆకుల ప్రభాకర్, సయీద్ నాజర్, అడ్వైసార్స్ పి. శ్రీనివాసు రెడ్డి, నాగిరెడ్డి చంద్ర, అబుతురాబ్, వెల్ఫేర్ టీం లీడర్ దుగ్గి గంగాధర్, మైనారిటి టీం లీడర్ గఫార్, షేక్ అజీస్, ఐటి విభాగం న్యాజ్, కోశధికారి షేక్ ఇనాయత్, ఎ.వి. సుబ్బారెడ్డి, ప్రావిణ్ కుమార్ రెడ్డి, సయ్యద్ సజ్జద్, రాకెట్ రఫీ, సి. చంద్రశేఖర్ రెడ్డి. బి. శివారెడ్డి, యం.వెంకట సుబ్బారెడ్డి, కె. వాసు, మా ఆలీ, షేక్ మున్వార్, సయ్యద్ అన్వర్, ఆయుబ్, మరియు వివిధ సంఘల సభ్యులు పాల్గోన్నారు.

Share this article :

0 comments: