Home »
» ఇప్పుడు రద్దు చేసినట్లు ప్రకటించడం హాస్యాస్పదం
ఇప్పుడు రద్దు చేసినట్లు ప్రకటించడం హాస్యాస్పదం
శ్రీకాకుళం: జిల్లాలోని సోంపేట థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను తాజాగా ఏపీ కేబినెట్ రద్దు చేసినట్లు ప్రకటించడంపై వైఎస్సార్ సీపీ మండిపడింది. గతంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసిన సోంపేట థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు కేబినెట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ను కూడా రద్దు చేస్తామని మహానాడులో తీర్మానం చేసిన సంగతి తమ్మినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి ఇప్పుడు కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రభుత్వాన్ని తమ్మినేని ప్రశ్నించారు. సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ భూములను ఇతరులకు కట్టబెట్టాలనే రహస్య ఎజెండాతోనే ఇప్పటి ప్రభుత్వం మాయ చేయడానికి యత్నిస్తోందన్నారు.
0 comments:
Post a Comment