మీ కూతురే ఆత్మహత్య చేసుకుంటే ఇలా వదిలేస్తారా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ కూతురే ఆత్మహత్య చేసుకుంటే ఇలా వదిలేస్తారా

మీ కూతురే ఆత్మహత్య చేసుకుంటే ఇలా వదిలేస్తారా

Written By news on Thursday, August 6, 2015 | 8/06/2015


మీ కూతురే ఆత్మహత్య చేసుకుంటే ఇలా వదిలేస్తారా
నాగార్జున వర్సిటీ వీసీని నిలదీసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
నిజనిర్ధారణ కమిటీ నిలదీతతో స్పందించిన వీసీ
ప్రిన్సిపాల్ బాబూరావుపై పోలీసులకు ఫిర్యాదు
వర్సిటీ కమిటీ చైర్మన్ మా చెవిలో కాలిఫ్లవర్ పెట్టారు
రిషితేశ్వరి ఆత్మహత్యను చిన్న విషయంగా కొట్టేశారు
రూం గురించిన గొడవతో ఆమె ఆత్మహత్య చేసుకుందట
తీవ్రంగా మండిపడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా


గుంటూరు: 
రిషితేశ్వరి ఆత్మహత్యను చిన్న విషయంగా కొట్టి పారేయడానికి యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఆ కమిటీ చైర్మన్ తమ చెవుల్లో కాలిఫ్లవర్ పెట్టారని ఎద్దేవా చేశారు. రిషితేశ్వరి రూంలో సౌకర్యాలు బాగున్నాయని, ఎదురుగా ఉన్న సీనియర్ల రూంలో సౌకర్యాలు అంత సరిగా లేవని.. తాము ఈ రూంలోకి వస్తామని వాళ్లు గొడవ చేయడంతో.. మనస్తాపం చెంది రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని రోజా మండిపడ్డారు. మీ కూతురే ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఫిర్యాదు చేస్తారా, లేక ఇలాగే వదిలేస్తారా అని తాము ప్రశ్నించామన్నారు. ఇలాంటి క్యారెక్టర్ లేని ప్రిన్సిపాల్ గురించి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటారా అని తాము నిలదీయడంతో.. అప్పుడు తెల్లకాగితం తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని రోజా చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
 •  
 • మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్లక్ష్యం వల్ల, ఇతర మంత్రుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు పోయాయి.
 • ర్యాగింగ్ భూతం టీడీపీ ప్రభుత్వంలో రెక్కలు విప్పుకొని పిల్లల ప్రాణాలు హరిస్తోంది.
 • ఇది కేవలం నాగార్జున వర్సిటీకి మాత్రమే పరిమితం కాదని మొన్నే చెప్పాం.
 • నిన్న వట్టిచెరుకూరులో సునీత అనే మరో విద్యార్థిని ర్యాగింగ్ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుంది.
 • కాలేజిలోనే ఒక పెట్రోలింగ్ వాహనం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
 • ఎవరైనా ర్యాగింగ్ గురించి ఓరల్ గా చెప్పినా కూడా చర్య తీసుకోవాలని కోరాం.
 • బాబూరావును ఎ1గా ప్రకటించి వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
 • వైఎస్ఆర్ సీపీ నిజనిర్ధారణ కమిటీ, విద్యార్థి, మహిళా విభాగాలు రిషితేశ్వరికి న్యాయం జరగాలని ఇక్కడకు వచ్చాయి.
 • ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని తెలిసింది.
 • వీసీతో మాట్లాడితే అసలు విషయం తెలిసింది. ప్రభుత్వం కేసును నీరుగార్చాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసింది.
 • ఎన్ని ప్రాణాలు పోతున్నా. వీసీ మాత్రం ఆయనకు రాసిచ్చిన స్క్రిప్టే చదువుతున్నారు.
 • పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగితే, పోలీసులే చూసుకుంటారన్నారు.
 • లెక్చరర్లను కూడా లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ ను కాపాడేందుకు ప్రయత్నించారు.
 • ప్రిన్సిపాల్ బాబూరావు హాయ్ ల్యాండ్ కు వెళ్లిన విషయం తనకు తెలియదంటారు వీసీ.
 • అసలు ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాంపౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లినందుకు కేసు పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు.
 • డేవిడ్ రాజు లాంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు గట్టిగా అడుగుతున్నారని ఆయన్ను ఇక్కడినుంచి తరిమేసిన విషయం నిజం కాదా అని అడుగుతున్నాము.
 • డేవిడ్ రాజును తరిమేయడానికి, పిల్లల్ని అరెస్టు చేయించడానికి హక్కులున్నాయి గానీ.. ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదు చేసే హక్కు లేదా అని అడుగుతున్నాం.
 • రిషితేశ్వరి మరణానికి ప్రిన్సిపాలే ప్రత్యక్షంగా కారణం.
Share this article :

0 comments: