యువత పార్టీకి వెన్నెముక లాంటి వారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం నేత భీష్వ రవీందర్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు పొంగులేటి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువతకు వైఎస్సార్ సీపీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పార్టీలోకి ఎంపీ వారిని సాదరంగా ఆహ్వానించారు.
కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, పార్టీ నేతలు శేఖర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, పార్టీ నేతలు శేఖర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment