వైఎస్ చిత్ర పటం తొలగింపు దుర్మార్గం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ చిత్ర పటం తొలగింపు దుర్మార్గం

వైఎస్ చిత్ర పటం తొలగింపు దుర్మార్గం

Written By news on Wednesday, August 12, 2015 | 8/12/2015


వైఎస్ చిత్ర పటం తొలగింపు దుర్మార్గం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాంజ్ నుంచి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించడం దుర్మార్గమని, దుష్ట సంప్రదాయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అధికారపక్షంపై ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్ చిత్రపటం లాంజ్‌లో ఉండాలా...’ అని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు హేళనగా మాట్లాడడం దారుణమని, పొట్టిశ్రీరాములు, ప్రకాశం పంతులు చిత్రపటాలను కూడా తొలగించామని గొప్పగా చెప్పుకోవడం ఏమిటని దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్య విలువల్ని, సంప్రదాయాల్ని కాపాడాల్సిన శాసనసభ స్పీకర్ కూడా ఆ పదవికి తగినట్లుగా వ్యవహరించలేదని, తన పదవికున్న ప్రాముఖ్యతను పోగొట్టారని ఆయన విమర్శించారు. పదవిలో ఉంటూ మృతి చెందారు కాబట్టి వైఎస్ చిత్రపటాన్ని ఆనాటి అసెంబ్లీ స్పీకర్, నాటి సీఎం, బీజేపీతోసహా అసెంబ్లీలోని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా అంగీకరించి లాంజ్‌లో ఏర్పాటు చేశారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. పార్లమెంట్‌లో దివంగత స్పీకర్ బాలయోగి గౌరవార్థం ఆయన పేరును లైబ్రరీ హాలుకు పెట్టారని, ఎన్టీఆర్ విగ్రహాన్నీ పార్లమెంట్‌లో ఉంచారని తెలిపారు.

రేపు అధికారంలోకి మరో గిట్టని పార్టీ వచ్చి వాటిని తొలగించడం సరైన సంప్రదాయమవుతుందా? అని ప్రశ్నించారు. వైఎస్ చిత్రపటం ఫ్రేం లూజ్ అయితే తొలగించామని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణరావు తనకు ఫోన్‌లో అబద్ధం చెప్పారని, కానీ ఇపుడు చీఫ్ విప్ చెప్పాక అసలు విషయం తెలిసిపోయిందన్నారు. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం చెప్పినట్లల్లా తలూపుతున్నారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలు ధర్నా చేసినపుడు రెండురోజుల్లో చిత్రపటాన్ని పెడతానని కార్యదర్శి హామీఇచ్చారంటూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు వైఎస్ చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టకపోతే తదుపరి కార్యాచరణను తమ నేత జగన్‌తో చర్చించి చేపడతామని గడికోట చెప్పారు.
 
టీడీపీ పర్పసెస్ కమిటీలా ఉంది...
రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలందరూ ఢిల్లీ ధర్నాకు వెళ్లింది చూసి అసాధారణ రీతిలో హడావుడిగా జనరల్ పర్పసెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడమేమిటని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నిం చారు. ఈ కమిటీలో పార్టీల సంఖ్యాబలం ప్రాతిపదికన గాక ఏకపక్షంగా 22 మంది అధికారపక్షం వారినే నియమించుకున్నారన్నారు. వాస్తవానికిది టీడీపీ పర్పసెస్ కమిటీలాగా ఉందే తప్ప జనరల్ పర్పసెస్‌కోసం ఏర్పాటు చేసినట్లు లేదని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: