కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ

కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ

Written By news on Thursday, August 6, 2015 | 8/06/2015


కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ
 నరసరావుపేటవెస్ట్ : ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నరసరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసగిస్తున్న బీజేపీ, టీడీపీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ర్యాలీ అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఆర్డీవో యం.శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఇతర నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కనీసం రాజధాని కూడా లేకుండా వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే ఆక్సిజన్‌లా పనిచేస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలసి సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసి అన్యాయం చేసిందన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, రాజధాని కోసం నిధులు, రైతులకు ప్రయోజనాలు.. ఇవన్నీ ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వివరించారు.

రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో ఐదేళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పిస్తామని ప్రకటిస్తే, సభలో ఉన్న ఇప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని, తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని వాగ్దానం చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ ప్రత్యేక హోదాపై సానుకూల ప్రకటన చేయకుండా కేంద్రమంత్రులు, టీడీపీ ఎంపీలు తలో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు కపలవాయి విజయకుమార్, షేక్.ఖాజావలి మాస్టారు, జెడ్పీటీసీ సభ్యుడు షేక్.నూరుల్‌అక్తాబ్, ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యస్.సుజాతాపాల్, కార్యదర్శి బాపతు రామకృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్ యస్.ఏ.హనీఫ్, మండల కన్వీనర్ కొమ్మనబోయిన శంకరయాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సైదావలి, మున్సిపల్ ప్లోర్‌లీడర్ మాగులూరి రమణారెడ్డి, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.గాబ్రియేలు, న్యాయవాదులు కె.రామ్మోహన్, కె.బాలాహనుమంతారెడి, శ్రీనివాసరెడ్డి, పట్టణ మైనార్టీ కన్వీనర్ షేక్.ఖాదర్‌బాషా, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సానికొమ్మ కోటిరెడ్డి, పట్టణ కార్యదర్శి యం.నరసింహారెడ్డి, రొంపిచర్ల మండల నాయకులు గెల్లి బ్రహ్మారెడ్డి, అన్నెం పున్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: