ప్రత్యేక హోదా సంజీవని కాదని ఎన్నికల్లో తెలియదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా సంజీవని కాదని ఎన్నికల్లో తెలియదా?

ప్రత్యేక హోదా సంజీవని కాదని ఎన్నికల్లో తెలియదా?

Written By news on Thursday, August 27, 2015 | 8/27/2015

కాకినాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ తప్పుబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న బీజేపీతో జట్టు కట్టి, గత శాసనసభ ఎన్నికలలో దాన్నో వజ్రాయుధంలా వాడుకున్నప్పుడు అది సంజీవని కాదన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. అన్నీ తెలిసే ప్రజలను మభ్యపెట్టి, వంచనకు గురిచేశారని దుయ్యబట్టారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల సహకారం కోరుతూ గురువారం సాయంత్రం జ్యోతుల కాకినాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఇంటికో ఉద్యోగం... లేకుంటే ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి' అని ఊదరగొట్టిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ఆ హామీలను గాలికొదిలేశారని విమర్శించారు.

కనీసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే.. తద్వారా వచ్చే పన్నులు తదితర రాయితీల వల్ల పరిశ్రమలు భారీ ఎత్తున ఏర్పాటవుతాయనే విషయం బాబుకు తెలియదా అని ప్రశ్నించారు. భారీ పరిశ్రమలు ఏర్పాటైతే పలువురికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని, కనీసం ఈ విధంగానైనా ఎన్నికల హామీలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది కదా అని అన్నారు. ప్రత్యేక హోదా సాధించాలని వైఎస్సార్ సీపీ పోరాడుతుండబట్టే కనీసం ఈ పాటి చర్చ అయినా తెరపైకి వచ్చిందన్నారు. అయితే పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను, ప్రజలను అణగదొక్కడానికి తెలుగుదేశం ప్రభుత్వం కుయుక్తులు పన్నడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో ప్రత్యేక హోదా రాదని యువత బలిదానాలకు పాల్పడటం సరికాదన్నారు. శాంతియుత మార్గంలో, సమన్వయంతోనే సాధించుకుందామని పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: