చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి సూటిప్రశ్న - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి సూటిప్రశ్న

చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి సూటిప్రశ్న

Written By news on Sunday, August 16, 2015 | 8/16/2015

హోదా కోసం పోరాడతారా.. లేదా?
హోదా కోసం పోరాడతారా.. లేదా?
♦ చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి సూటిప్రశ్న
♦ అయినా మభ్యపెడతారెందుకు?  కేంద్రంతో పోరాటానికి టీడీపీ సిద్ధమా?
♦ 29న చేపట్టనున్న బంద్‌ను జయప్రదం చేయండి

 సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వస్తాయని చెబుతున్న చంద్రబాబు ఎప్పటిలోగా వాటిని సాధించగలరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శనివారంనాడిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే సత్తా అసలు చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటడానికి బాబు సిద్ధంగా ఉం టారా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ టీడీపీ ఎంపీల సమక్షంలోనే తేల్చిచెప్పినా వారంతా మిన్నకుండిపోయారని తప్పుబట్టారు. ఇటీవలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ వాయిదా తీర్మానం రూపంలోనో, ప్లకార్డులతో నిత్యం ఆందోళన చేపట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచామని చెబుతూ టీడీపీ నేతలు ఏమాత్రం స్పందించకపోవడం విడ్డూరమన్నారు.

రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు రావడం మంచిదేననీ, ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీని ఒకే గాటన కట్టొద్దని మిధున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా రావడం వల్ల సామాన్య ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఆరేళ్లు కావసున్నా చంద్రబాబు ఇప్పుడు ఆయనపై విమర్శలు చేస్తున్నారని నిప్పులుచెరిగారు.స్వాతంత్ర దినోత్సవం రోజున అవినీతికి వ్యతిరేకంగా ప్రమాణం చేయించిన బాబు ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డికి అంత డబ్బెవరి ద్వారా వెళ్లాయో కూడా స్పష్టం చేయాలని  మిధున్‌రెడ్డి డిమాండ్ చేశారు.

 బంద్‌కు ప్రజలందరూ మద్దతు పలకాలి
 ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 29వ తేదీన జరపతలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ప్రజలందరూ విజయవంతం చేయాలని మిధున్‌రెడ్డి కోరారు.హోదాతోపాటు విభజన హామీల అమలుకు జగన్‌మోహన్‌రెడ్డి మొదట నుంచీ ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటు ఢిల్లీలో ధర్నా చేపట్టారని గుర్తు చేశారు. ఈ పోరాటానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: