ఆయన చెప్పిందే పవన్ చెప్పారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయన చెప్పిందే పవన్ చెప్పారు..

ఆయన చెప్పిందే పవన్ చెప్పారు..

Written By news on Wednesday, August 26, 2015 | 8/26/2015

ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల్లో బలవంతపు భూ సేకరణకు పాల్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆపార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. ఏపీ రాజధాని రైతులకు మద్ధతుగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ .... 'కొన్ని గ్రామాల్లో రైతులు మా పొలాలు ఇవ్వం అని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు సర్కార్  భూ సేకరణకు పాల్పడుతోంది.  రైతుల  భూములు బలవంతంగా లాక్కుంటే ఊరుకునేది లేదని మా నాయకుడు వైఎస్ జగన్ అనేకసార్లు చెప్పారు. అయితే ఈరోజు సీఎం చంద్రబాబు కానీ, మంత్రులు చెప్పే సాకులు చాలా విచిత్రంగా ఉన్నాయి.  రాజధాని కట్టడం వైఎస్ జగన్కు ఇష్టం లేదు. టీడీపీకి మంచి పేరు వస్తుందని జగన్ అడ్డుపడుతున్నాడని మంత్రులు మాట్లాడుతున్నారు.

అయితే రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేస్తే సహించేది లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబితే ...ఆయన చెప్పింది కరెక్ట్, మేము అనుసరిస్తామని మంత్రులు చెబుతున్నారు. మరి ఆయన చెప్పిందే వైఎస్ జగన్ కూడా చెబుతున్నారు. పవన్ చెప్పిందే వైఎస్ జగన్ చెబితే తప్పు అంటున్నారు ఇదేమీ విడ్డూరం. చంద్రబాబు నాయుడు పాలనకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. బలవంతంగా భూ సేకరణకు పూనుకుంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీతో పాటు వామపక్షాలు,అదేవిధంగా బాబు దొంగ మాటలు నమ్మి టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ కూడా.... చంద్రబాబును పుట్బాల్లా ఆడుకుంటూ బాల్ కింద పడకుండా కొట్టే రోజులు ముందు ఉన్నాయి.  నిడమర్రు, పెనుమాక గ్రామాల ప్రజలకు వైఎస్ఆర్ సీపీతో పాటు అన్ని పార్టీలు అండగా ఉన్నాయి. ధైర్యంగా ఉండాలని' సూచించారు.
Share this article :

0 comments: