ఆనాడు వెంకయ్య అడగలేదా?:వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆనాడు వెంకయ్య అడగలేదా?:వైఎస్ జగన్

ఆనాడు వెంకయ్య అడగలేదా?:వైఎస్ జగన్

Written By news on Monday, August 10, 2015 | 8/10/2015

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశంపై  ఆనాడు రాజ్యసభలో మాట్లాడిన బీజేపీ..  ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కు తగ్గుందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో సోమవారం జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా చేపట్టింది. దీనిలో భాగంగా ఏఎన్ఐతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఆనాడు ఏపీకి 10 ఏళ్ల ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వ్యాఖ్యానించిన వెంకయ్య నాయుడు..  నేడు ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదని అనడానికి కారణం ఏమిటని జగన్ ప్రశ్నించారు.  ఈ విషయంపై నాటి పెద్దల సభలో అరుణ్ జైట్లీ కూడా మాట్లాడిన సంగతిని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీతో పాటు, కాంగ్రెస్, టీడీపీలు కూడా ప్రధాన కారణమని మండిపడ్డారు.
 
బీజేపీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటక పోవడానికి కారణం ఏమిటని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు పెట్టిన టీడీపీ.. అవినీతి డబ్బుతో ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడానికే  మొగ్గుచూపుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
 
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
 
*ప్రత్యేక హోదా కోసం మేము చేస్తున్న డిమాండ్ కొత్తది కాదు
* కాంగ్రెస్ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విడగొట్టింది
*ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ప్రత్యేక హోదా సరిపోదు.. పదేళ్లు కావాలని బీజేపీ నాడు డిమాండ్ చేసింది
*పార్లమెంట్ లో ఇచ్చిన మాటకు విలువ లేకపోతే ఎలా?
*ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు 14వ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధం లేదు
*ప్రత్యేక హోదాను ఫైనాన్స్ కమిషన్ వద్దని సూచించడం దారుణం
*ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసే అధికారమున్న ప్రభుత్వాన్ని ఎందుకు ఆపుతున్నారు?
*15 నెలలుగా ఒక్కసారిగా కూడా పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిమాండ్ చేయలేదు
*రాజకీయం చేస్తున్నానని నన్ను అనడం అవివేకం
*ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే ప్రతిపక్షంలో ఉన్న మాకు మేలు కలుగుతుందా?
*ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు అడుగుతానంటే మేము ఎప్పుడూ అడ్డుపడలేదు
*అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని చంద్రబాబును కోరాం, కానీ స్పందించలేదు
*సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారు
*తనపై ఉన్న కేసులు ఎక్కడ బయటపడతాయోనని భయం.. అందుకే చంద్రబాబు రాజీ పడుతున్నారు
Share this article :

0 comments: