బాబు జమానా.. అక్రమాల ఖజానా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు జమానా.. అక్రమాల ఖజానా

బాబు జమానా.. అక్రమాల ఖజానా

Written By news on Sunday, August 16, 2015 | 8/16/2015


'బాబు జమానా.. అక్రమాల ఖజానా'
 రైతుల భూములతో రాజకీయ వ్యాపారం
 రాజధాని ప్రాంతంలో స్వాతంత్య్ర హరణం
 ఎన్టీఆర్ పార్టీలో ‘నారాయణ’ మంత్రం
 దుర్భిక్షం ముంగిట్లో మరోసారి రాష్ట్రం


మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి నియోజకవర్గం) ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్ పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రం తిరిగి కరువు కోరల్లో చిక్కుకుందని,  సాగునీరు లేక, రైతులు వలస బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ వ్యవసాయశాఖ మంత్రి జిల్లాలోనే దుర్భిక్ష పరిస్థితులున్నా పట్టించుకునే నాథుడడే కరువయ్యాడని విమర్శించారు. నీరు- చెట్టు పేరుతో ప్రకృతి వనరులను యధేచ్చగా దోచుకుంటున్నారని, పట్టిసీమతో ఆగస్టు15 నాటికి రాయలసీమకు నీరు పారుతుందని చెప్పినా... అవినీతి మాత్రం ఏరులై పారిందని ఆరోపించారు.
రాజధాని పేరుతో ఐదేళ్ళపాటు హైడ్రామాను రక్తి కట్టించాలని చూస్తున్నారని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం దూరం పెట్టి ‘నారాయణ’ మంత్రం జపిస్తున్నారన్నారు. తన అడ్డగోలు దోపిడీకి అండగా నిలిచే అధికారులను అందలం ఎక్కిస్తున్నారని దుయ్యబట్టారు. ‘రాజధాని ప్రాంత ప్రజలు, రైతుల స్వాతంత్య్రాన్ని హరించి భూసేకరణ పేరుతో బె దిరింపులకు దిగుతున్నారు...అసలు రాజధాని నిర్మాణానికి రెండు వేల ఎకరాలు సరిపోతుంది కదా.. 33 వేల ఎకరాలు ఎందుకంటే సమాధానం చెప్పరు. జపాన్, సింగపూర్‌లకు వేల ఎకరాలు ధారాదత్తం చేసి వందల కోట్లు కొల్లగొట్టే వ్యూహం బహిర్గతమైనా నిస్సిగ్గుగా పన్నాగాలు పన్నుతున్నారు.

 పేద ప్రజలు, రైతులను దోచుకునే వారితో పాటు దోపిడీకి సహకరిస్తున్న ప్రతిఒక్కరిని కోర్టు మెట్లెక్కించి తీరతాన’ని ఆర్కే హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో రైతుకూలీలు, కౌలు రైతులు, అసైన్డ్ భూముల రైతుల గోడు పట్టించుకొనేవారే లేరని, భూములిచ్చిన రైతులను  తన్ని తరిమేసి ఉద్యోగులకు ఇళ్ళు కట్టిస్తామనడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించా రు. కోట్ల విలువ చేసే భూములు త్యాగం చేసిన రైతు కుటుం బాలకు మీ హైటెక్ రాజధానిలో నివసించే అర్హత లేదా అని ఎమ్మెల్యే నిలదీశారు. మంత్రులు స్టార్‌హోటళ్ళలో బస చేయొ ద్దని హుకుం జారీ చేసిన ముఖ్యమంత్రి తాను మాత్రం ప్రత్యే క విమానాల్లో తిరుగుతూ, వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని తన విలాసవంతమైన భవనాలకు ఖర్చు చేయవచ్చా అని ఆర్కే ప్రశ్నించారు. ఉండవల్లి కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను ఆక్రమించుకుని తన గెస్ట్‌హౌస్‌లుగా వాడుకొనేందుకు సక్రమ నిర్మాణాలుగా మార్చిన ఘనత బాబుకే ద క్కిందన్నారు. దేవాదాయశాఖ భూములను కైంకర్యం చేసి దేవుడికే శఠగోపం పెడుతున్నారని, ధర్మప్రచారానికి ఉద్దేశించి న ఆస్తులను వ్యాపారులకు కట్టబెట్టే కుట్రపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆర్కే స్పష్టం చేశారు.

 ఓటుకు నోటు కేసులో నిందితుడిగా నిర్ధారణ అయినా తెలంగాణ ప్రభుత్వం చర్యల కు వెనుకాడుతుందంటే చంద్రబాబు ఏ చీకటి ఒప్పందం చే సుకున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఒక ప్రకటన చేస్తే పక్కనే వున్న చంద్రబాబు మరొక ప్రకటన చేస్తూ రాష్ట్రప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫోటో సైతం చంద్రబాబు అక్రమాలను ప్రశ్నిస్తోందని, అందుకే అసెంబ్లీలో ఆయన ఫొటోను తొలగించి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పుష్కరాల పేరుతో కోట్లు దండుకున్న చంద్రబాబు, నారాయణ ప్రచారార్భాటం తో ముప్ఫై మంది ప్రాణాలు బలిగొన్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలన ఇలాగే సాగితే ప్రజలకు కడుపు మండి ప్రత్యక్ష పోరాటాలకు దిగటం ఖాయమని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: