వైఎస్ విగ్రహ గద్దె కూల్చివేతపై భగ్గు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ విగ్రహ గద్దె కూల్చివేతపై భగ్గు

వైఎస్ విగ్రహ గద్దె కూల్చివేతపై భగ్గు

Written By news on Friday, August 7, 2015 | 8/07/2015


వైఎస్ విగ్రహ గద్దె కూల్చివేతపై భగ్గు
300 మంది వైఎస్సార్ సీపీ నాయకుల ధర్నా
వైఎస్.రాజశేఖరరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం
మహానేత విగ్రహ గద్దె కూల్చడం సరికాదు
విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి
జేసీని కలిసిన కొండా రాఘవరెడ్డి,  జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి

 
 కాజీపేట రూరల్ : కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం సరికాదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్సార్ విగ్రహ గద్దెను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టర్ బంగ్లా సెంటర్‌లో 300 మంది వైఎస్సార్ సీపీ నాయకలు ధర్నాకు చేశారు. తెలుగు ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానేత విగ్రహ గద్దెను కూల్చివేయడం  బాధాకరమని, దీన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. జనహృదయ నేత విగ్రహ గద్దెను కూల్చివేయడం దుశ్చర్యకు నిదర్శనమన్నారు. విగ్రహం గద్దెను కూల్చిన స్థలంలోనే విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో విగ్రహాలను కూల్చివేసే సంస్కృతి మంచిది కాదని, అనుమతి ఉన్న విగ్రహ గద్దెను కూల్చివేయడం క్షమించరానిదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగునింపిన అపరభగీరథుడి విగ్రహ గద్దెను కూల్చివేయడం బాధాకరమన్నారు.

జిల్లాలో వైఎస్సార్ విగ్రహాలకు ఎలాంటి హాని తలపెట్టినా.. రెచ్చగొట్టే దుశ్చర్యలకు పాల్పడి రాజకీయం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ విగ్రహాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం విగ్ర హ గద్దె కూల్చిన స్థలంలో రాజశేఖరరెడ్డి ప్లెక్సీని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. అనంతరం కొండా రాఘవరెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జేపీ ప్రశాంత్ పాటిల్‌ను కలిసి గద్దెన కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, గద్దెను తిరిగి ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్ జిల్లా నాయకులు అప్పం కిషన్, చల్లా అమరేందర్‌రెడ్డి, షంషీర్ బేగ్, మునిగాల కల్యాణ్ రాజ్, మంచె అశోక్, అచ్చిరెడ్డి, దుప్పటి ప్రకాష్, సుదర్శన్‌రెడ్డి, ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఎస్‌ఎ ఖాదర్, గౌని సాంబయ్య గౌడ్, నాగపురి దయాకర్, బద్రుద్దీన్‌ఖాన్, పిడిశెట్టి సంపత్, బొడ్డు శ్రావణ్, మాధవరెడ్డి, సంగాల ఈర్మియా, సాల్మన్‌రాజ్, ముజఫరుద్దీన్ ఖాన్, నెమలిపురి రఘు, కౌటిల్ రెడ్డి, వీరారెడ్డి, కైసర్, రాములు నాయక్, నరేందర్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, రజినీకాంత్, రాజు, లోకు రమేష్, మొగిలి, జితేందర్‌రెడ్డి, సిరికొండ రామేశ్వరచారి పాల్గొన్నారు.
Share this article :

0 comments: