వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Monday, August 24, 2015 | 8/24/2015


వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
♦  జిల్లా నుంచి భారీగా తరలిరావాలని
♦  పార్టీ శ్రేణులకు పాయం పిలుపు

 ఖమ్మం : సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నిర్వహించే పరామర్శ యాత్రకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు త రలిరావాలని  ఆ పార్టీ జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పి లుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో షర్మిల పాదయాత్ర వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లాలో జరిగే పరామర్శ యాత్రలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర నాయకత్వం పాల్గొంటుందని పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శించుకుంటూ వస్తున్న  వైఎస్ కుమార్తె షర్మిల  వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు. యాత్ర వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుందని పాయం పేర్కొన్నారు. ఈ యాత్రకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని పాయం పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: