ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తాం

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తాం

Written By news on Sunday, August 30, 2015 | 8/30/2015


'ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తాం'
హైదరాబాద్: రేపట్నుంచి ఆరంభం కానున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి వాయిదా తీర్మానం ఇస్తామని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది. ఆదివారం లోటస్ పాండ్ లో జరిగిన వైఎస్సార్ సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజాలు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయిన తొలిరోజే ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం ఇస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శాసనసభలో ఏకగ్రీవం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తామన్నారు.
 
దీంతోపాటు ఓటుకు కోట్లు కేసు, ఇసుక మాఫియా, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు, కరువు, నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వాధికారులపై దాడులు, నీరు-చెట్టులోని అవినీతి అంశాలను సభలో లేవనెత్తుతామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులైనా జరపాలని బీఏసీ సమావేశంలో అడుగుతామన్నారు. టీడీపీ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా.. వైఎస్సార్ సీపీ మాత్రం గట్టిగా ప్రజా సమస్యలపై నిలదీస్తుందని ఎమ్మెల్యేలు తెలిపారు.
Share this article :

0 comments: