ఏపీ స్పీకర్, ముఖ్యమంత్రిలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీ స్పీకర్, ముఖ్యమంత్రిలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ

ఏపీ స్పీకర్, ముఖ్యమంత్రిలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ

Written By news on Saturday, August 8, 2015 | 8/08/2015

ఏపీ స్పీకర్, ముఖ్యమంత్రిలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ
జనరల్ పర్పసెస్ సమావేశానికి ప్రతిపక్షం నుంచి ముగ్గురేనా
శాసన సభా సంప్రదాయం ఎటు పోయింది
ప్రత్యేక హోదా కోసం మా ఢిల్లీ ధర్నా రోజునే సమావేశమా


హైదరాబాద్: 
ప్రజా సమస్యలను చర్చించకుండా సభను దారి తప్పించే కుటిల వ్యూహాలకు శాసన సభను వేదికగా మార్చొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావులకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశాన్ని ఈనెల 11వ తేదీన నిర్వహిస్తామని చెప్పడం, అందులో ప్రతిపక్షం నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్తో కలిపి మొత్తం 25 మందిని దీనికి పిలుస్తుండగా.. తనతో కలిపి కేవలం ముగ్గురికే ప్రతిపక్షం నుంచి అవకాశం ఇవ్వడమేంటని నిలదీశారు. దామాషా పద్ధతిని పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము ఢిల్లీలో ధర్నా చేస్తున్నరోజే ఈ సమావేశం నిర్వహించడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

అసలు కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశం గత 12 ఏళ్లలో ఏనాడూ జరగలేదని ఆయన చెప్పారు. 1995-2004 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా తూతూమంత్రంగా సమావేశాన్ని నిర్వహించినట్లు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. కనీసం సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఇవ్వడానికి కూడా శాసన సభ కార్యాలయం సిద్ధంగా లేదని ఆయన మండిపడ్డారు.

రానున్న వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, అవినీతి, అన్యాయాలపై చర్చ జరగకుండా ఉండేందుకే ఒక పథకం ప్రకారం అత్యున్నతమైన శాసన సభను ఉపయోగించుకుంటున్నారన్న విషయం ఎవరికైనా అర్థం అవుతుందన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రస్తావించబోయే 19 ప్రధానాంశాలను కూడా ఆయన తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.





Share this article :

0 comments: