‘హోదా’ తప్పక అమలు చేయాల్సిందే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘హోదా’ తప్పక అమలు చేయాల్సిందే..

‘హోదా’ తప్పక అమలు చేయాల్సిందే..

Written By news on Saturday, August 1, 2015 | 8/01/2015


‘హోదా’ తప్పక అమలు చేయాల్సిందే..
కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఆందోళన చేస్తుందని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం రాష్ట్ర విభజన నాడు పార్లమెంటులో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ అని, దాన్ని తప్పక అమలు చేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిహార్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక మంత్రి ఇందర్‌జిత్ సింగ్ సమాధానమిస్తూ.. ఇక కొత్తగా ప్రత్యేక హోదా అనే ప్రశ్నే తలె త్తదని చెప్పడం బిహార్‌కు సంబంధించినది మాత్రమే అయి ఉంటుందని వైవీ పేర్కొన్నారు. కేంద్రం ఉద్దేశం ఏదైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై వైఎస్సార్‌సీపీ తగిన రీతిలో ఆందోళన చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్రాన్ని నిలదీసేందుకు సోమవారం సభలో వాయిదా తీర్మానం కోసం నోటీసు ఇస్తామన్నారు.
 
బాధితుల విడుదలకు కేంద్రం చొరవచూపాలి :లిబియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు తీవ్రవాదుల బందీలుగా ఉన్న సంఘటన విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రి చొరవచూపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. అందరినీ క్షేమంగా విడుదల చేయించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

విభజన హామీలు నెరవేర్చండి : వైఎస్సార్‌సీపీ ఎంపీల వినతి

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన హామీల మేరకు రైల్వేశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను సత్వరం పరిష్కరించాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి శుక్రవారమిక్కడ రైల్వేమంత్రిని కలసి పెండింగ్ అంశాలను గుర్తుచేశారు. రైల్వే జోన్ ఏర్పాటు, కొత్త రైళ్ల ఏర్పాటు తదితర అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Share this article :

0 comments: