యుగానికి ఒక్కరే పుడతారు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యుగానికి ఒక్కరే పుడతారు: వైఎస్ జగన్

యుగానికి ఒక్కరే పుడతారు: వైఎస్ జగన్

Written By news on Monday, August 31, 2015 | 8/31/2015


యుగానికి ఒక్కరే పుడతారు: వైఎస్ జగన్
హైదరాబాద్ :  భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ అబ్దుల్ కలాం అని ఏపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు.  కలాం మృతికి ఏపీ అసెంబ్లీ సంతాప తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కలాం మరణ వార్త దేశవ్యాప్తంగా తనతో పాటు...అందరినీ ఎంతగానో కలచివేసిన సంఘటన. కలాం లాంటి వ్యక్తులు యుగానికి ఒక్కరే పుడతారు.

అలాంటి మహానుభావుడు అట్టడుగు స్థాయిలోని మత్య్యకార కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్ గా పనిచేసి... మహోన్నత స్థాయి అయిన రాష్ట్రపతి పదవి వరకూ ఎదిగిన వ్యక్తి.  రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఉపాధ్యాయుడిగా మారి తన జీవితాన్ని సామాన్యంగా బతికిన మహనీయుడు. రాజకీయాల్లో రోల్ మోడల్ ఎవరంటే అబ్దుల్ కలాం  మొదటి వరుసలో ఉంటారు. 84 ఏళ్ల వయసులో కూడా భారతదేశం గురించి జ్ఞానాన్ని పంచుతూ చదువుల తల్లి ఒడిలో ఒదిగారు. మా తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి కలాంకు నివాళులు అర్పిస్తున్నాం'  అని తెలిపారు.
Share this article :

0 comments: