ప్రభుత్వాల మెడలొంచైనా ప్రత్యేక హోదా సాధిద్దాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వాల మెడలొంచైనా ప్రత్యేక హోదా సాధిద్దాం

ప్రభుత్వాల మెడలొంచైనా ప్రత్యేక హోదా సాధిద్దాం

Written By news on Sunday, August 23, 2015 | 8/23/2015


ప్రభుత్వాల మెడలొంచైనా ప్రత్యేక హోదా సాధిద్దాం
♦ 29న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి
♦ బంద్ పోస్టర్ ఆవిష్కరణ

 తిరుపతి మంగళం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలొంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. పద్మావతీపురంలోని కరుణాకరరెడ్డి నివాసంలో శనివారం రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర బంద్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందన్నారు.

అప్పుడే బీజేపీ, టీడీపీ ఆంధ్ర రాష్ట్రానికి పదేళ్లుప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో హామీ ఇచ్చారన్నారు. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేంద్రాన్ని ఎదురించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. పదవీ వ్యామోహంతో నరేంద్రమోదీ కాళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. జగనన్న పిలుపు మేరకు ఈ నెల 29వ తేదీ రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

 27న జిల్లా స్థాయి సమావేశం
 బంద్‌పై ఈ నెల 27వ తేదీన తిరుపతిలోని పీఎల్‌ఆర్ గ్రాండ్ హోటల్లో జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి తెలిపారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్‌కే బాబు, కేతం, బోయనపాటి మమత, జయచంద్రారెడ్డి, టి.రాజేంద్ర, పుల్లయ్య, నాయకులు బీరేంద్ర వర్మ, మల్లం రవిచంద్రారెడ్డి ఎంవీఎస్. మణి, పుల్లూరు అమరనాథ్‌రెడ్డి, పోతిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌కే ఇమామ్, కొండారెడ్డి, నాగిరెడ్డి, తాలూరు ప్రసాద్, గీత, పుష్పలత, పునీత, సాయికుమారి పాల్గొన్నారు.
Share this article :

0 comments: