పులివెందులకు నేడు వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందులకు నేడు వైఎస్ జగన్

పులివెందులకు నేడు వైఎస్ జగన్

Written By news on Monday, August 17, 2015 | 8/17/2015


నేడు వైఎస్ జగన్ రాక
పులివెందుల :  వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం వైఎస్ జగన్ బెంగళూరులో బయలుదేరి మధ్యాహ్నానికి పులివెందులకు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలనుంచి తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. 18న మంగళవారం ఉదయం 9 గంటలకు సింహాద్రిపురం మండలం బలపనూరుకు చేరుకొని ఇటీవల అనారోగ్యంతో మరణించిన బలపనూరు సర్పంచ్ సరస్వతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు.

అనంతరం సింహాద్రిపురం మండలంలో ఎండిన వేరుసెనగ, పత్తి పంటలను అధికారులతో కలిసి పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30గంటలకు పులివెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో పీబీసీ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతోపాటు మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో పీబీసీకి నీటి కేటాయింపులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 19న ఉదయం తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.  12.30 గంటలకు పులివెందులలోని వీజే ఫంక్షన్ హాలులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రాయలాపురం భాస్కర్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు హాజరవుతారు. రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.
Share this article :

0 comments: