స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్

స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్

Written By news on Sunday, August 9, 2015 | 8/09/2015
హైదరాబాద్: స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్ నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం న్యూఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద రేపు నిర్వహించనున్న ధర్నాకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరుకానున్నారు. వైఎస్ జగన్ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నారు.


ఈ ధర్నా అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వారంతా ఏపీ ప్రత్యేక హోదా కోసం మార్చ్ టు పార్లమెంట్ చేయనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో న్యూఢిల్లీ బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు మాటలే చెప్పాం.... ఇకపై చేతల్లో చూపిస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం కోసం అధికార టీడీపీ... ఏపీకి ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కిందని వారు ఆరోపించారు.అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ ధర్నా ద్వారా పత్ర్యేక హోదా కోసం కేంద్రంపై పోరుబాటకు వైఎస్ఆర్ సీపీ శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత కేంద్ర, రాష్ట్రాలపైనే ఉందని వైఎస్ఆర్ సీపీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. రేపు వైఎస్ జగన్ ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ సీపీ తన మద్దతు ప్రకటించింది.
Share this article :

0 comments: