రాత రాసి ఉంటే.. సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాత రాసి ఉంటే.. సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు

రాత రాసి ఉంటే.. సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు

Written By news on Wednesday, August 26, 2015 | 8/26/2015

విజయవాడ: ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సంస్థలకు రాజధాని నిర్మించాలన్న దుర్భుద్దితో... రైతులు ఒప్పుకోకపోయినా ప్రజల కన్నీటితో రాజధాని నిర్మించేందుకు సిద్ధమయ్యారని.. అధికారం ఉంది కదా అని మదమెక్కిన మనస్తత్వంతో బలవంతంగా భూ సేకరణకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. భూములు కోల్పోయిన రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..
 
  • రాజధాని నిర్మాణం కోసం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అధికారం ఉందని చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కుంటున్నారు.
  • భూములు లాక్కునేందుకు అబద్ధాలు కూడా చెబుతున్నారు.
  • నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో రాజధాని భూములకు వ్యతిరేకంగా మూడు పంటల పండించే భూములు బలవంతంగా తీసుకున్నారని, రైతులు కేసులు వేశారు.
  • కౌంటర్ ఫైలు చేసిన దానిలో చంద్రబాబు...3 పంటలు పండే భూములు లేవు. 2వేల ఎకరాలే మాగాణి. మిగిలినదంతా మెట్ట భూములు అని చెప్పారు.
  •  కార్పొరేట్ సంస్థల కోసమే చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారు.
  •  రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములు బలవంతంగా లాక్కుంటోంది.
  •  ప్రభుత్వం అన్యాయం చేస్తే ప్రజలు ఎవరి దగ్గరకు పోవాలి
  • ముఖ్యమంత్రి అంటే మనసున్నవాడు కావాలి. కానీ భూ బకాసురుడయ్యాడు.
  •  అధికారం అన్నది ఎల్లకాలం ఒకరి వద్దే ఉండదు.  
  •  మీరు చేసే అన్యాయం ఎల్లకాలం ఉండదు. త్వరలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది
  •  బలంతంగా తీసుకున్న రైతుల భూముల్ని మళ్లీ వారికి ఇచ్చి... సాగులోకి తెస్తాం
  •  చంద్రబాబు పాలన అంతా మోసం మోసం మోసం అనే పదంతో సాగుతోంది.
  •  ఓటు వేసిన రైతన్నలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.
  •  రైతుల జీవితాలతో చెలగాటం ఆడి, వారు ఆత్మహత్యలు చేసుకునేలా టీడీపీ సర్కారు వ్యవహరిస్తోంది
  •  ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్న బాబు...పచ్చి మోసం చేశారు.
  •  చంద్రబాబు మోసంతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు.
  •  ప్రత్యేక హోదా అన్న అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారు.
  •  హోదా ఇస్తే  అన్ని విధాల రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుంది.
  •  రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతోంది.
  • చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దు...ప్యాకేజీ చాలంటున్నారు.
  •  ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే మోదీ కాళ్ల దగ్గర బాబు సాష్టాంగ పడుతున్నారు.
  • నా పై కేసులు ఉన్నాయి. అప్పట్లో సోనియా గాంధీతోనే తలపడ్డా.
  • ఇప్పుడూ కూడా భయపడను.
  • దేవుడు రాత రాస్తే...నేను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరు.
  • బీజేపీ మెడలు వంచేలా హోదా కోసం చంద్రబాబు పోరాడాలి, లేదంటే చంద్రబాబు మెడలు మేం వంచుతాం.
  • ఈ నెల 29న వైఎస్ఆర్ సీపీ బంద్ను వ్యతిరేకించేందుకు చంద్రబాబు నానా కుయుక్తులు పన్నుతున్నారు.
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్ సీపీ బంద్ చేపట్టింది.
Share this article :

0 comments: