ఎస్సై వేధింపులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎస్సై వేధింపులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య

ఎస్సై వేధింపులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య

Written By news on Saturday, August 15, 2015 | 8/15/2015


ఎస్సై వేధింపులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య
♦ మనస్తాపంతో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్య
♦ మృతదేహంతో రాస్తారోకో
♦ పెదారికట్లలో మూడు గంటల పాటు ఉద్రిక్తత
♦ కొనకనమిట్ల ఎస్సైపై గ్రామస్తుల మండిపాటు

 పెదారికట్ల (కొనకనమిట్ల) : ఎస్సై వేధింపులకు తాళలేక వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెదారికట్లలో శుక్రవారం జరిగింది. మృతుని బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజాల నిమ్మారెడ్డి(18) తల్లిదండ్రులు ఇటీవల గ్రామంలో జరిగిన అన్నదమ్ముల కొట్లాట కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్నారు. కొనకనమిట్ల ఎస్సై మస్తాన్ షరీఫ్ కొట్లాట జరిగిన రోజు నుంచి గ్రామంలోకి వచ్చి తరుచూ నిమ్మారెడ్డిని బెదిరిస్తున్నాడు. మరో వైపు నిమ్మారెడ్డి వ్యతిరేక వర్గీయులకు ఎస్సై అండగా నిలిచాడు. భయపడటంతో పాటు, తీవ్రమస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని నిమ్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 మృతదేహంతో రాస్తారోకో
 నిమ్మారెడ్డి మృతదేహాన్ని పెదారికట్ల బస్టాండ్ సెంటర్‌లో ఉంచి బంధువులు రాస్తారోకో చేశారు. నిమ్మారెడ్డి మృతికి కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనకు దిగారు. సీఐ రవిచంద్ర వచ్చి వివరాలు సేకరించారు. ఆందోళన ఉధృతం కావడంతో దర్శి డీఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుని బంధువులతో మాట్లాడారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డిలు పోలీసులతో మాట్లాడారు.

లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎస్సైపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోతో వాహనాలు ఇరువైపులా బారులు తీరాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, రేగడపల్లి సొసైటీ అధ్యక్షుడు కామసాని వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వాకా వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.
Share this article :

0 comments: