బాబు స్వార్థానికి రాష్ట్రం బలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు స్వార్థానికి రాష్ట్రం బలి

బాబు స్వార్థానికి రాష్ట్రం బలి

Written By news on Friday, August 28, 2015 | 8/28/2015


బాబు స్వార్థానికి రాష్ట్రం బలి
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బి. గురునాథరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిన ఆయనకు పాలించే అర్హతలేదన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం గురునాథరెడ్డి విలేకరులతో మాట్లాడారు.  యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదాతో పాటు రూ. 5 లక్షల కోట్లు విడతల వారీగా నిధులు కేటాయిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మన్మోహన్‌సింగ్ చెప్పారన్నారు.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఐదు సంవత్సరాలు సరిపోదని పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఇలాంటి పెద్దమనిషి  అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడం శోచనీయమన్నారు.    మాజీ మేయర్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ  రాష్ట్ర ప్రయోజనాల కోసం 29న నిర్వహించే బంద్‌ను విజయవంతం చే యాలని నాయకులు పిలుపునిచ్చారు.  నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్, కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, రాష్ట్ర కార్యదర్శి గౌస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మైనుద్దీన్, సోములదొడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

 జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం మూర్ఖత్వం
 యూనివర్సిటీ:  ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న పోరాటాలను వి మర్శించడం మూర్ఖత్వమని వైఎస్సార్‌సీపీ అధికార ప్ర తినిధి ఆలమూరు శ్రీనివాస రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కా ర్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  29న చేపడుతున్న రాష్ర్టవ్యాప్త బంద్‌కు అన్ని వర్గాల నుంచి విశేషమైన స్పందన వస్తుండంతో  రాష్ట్ర మంత్రులు మతిభ్రమించి , అసందర్భ అసత్య ఆరోపణలకు పాల్బడుతున్నారన్నారు.
Share this article :

0 comments: