మూడు రోజుల పర్యటన విజయవంతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడు రోజుల పర్యటన విజయవంతం

మూడు రోజుల పర్యటన విజయవంతం

Written By news on Thursday, August 20, 2015 | 8/20/2015


పలకరింపులు..పరామర్శలు
♦ బిజీబిజీగా వైఎస్ జగన్ 
♦ మూడు రోజుల పర్యటన విజయవంతం

 సాక్షి, కడప : అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు.. కరచాలనం చేయాలని ఎగబడుతున్న వారికి చేయి అందిస్తూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ.. అధైర్య పడే  వారికి నేనున్నానంటూ ధైర్యం చెబుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శిస్తూ.. మృతుల కుటుంబ సభ్యులను ఓదారుస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం బిజీబిజీగా గడిపారు. పులివెందుల నుంచి ఉదయమే బయలుదేరిన వైఎస్ జగన్‌కు వీరపునాయునిపల్లె మండల సరిహద్దులో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.

అనంతరం వైఎస్ జగన్‌తోపాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలు యు.రాజుపాలెం చేరుకొని మాజీ సర్పంచ్ పి.పెద్దచెన్నారెడ్డి (ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు) కుమారులు రామచంద్రారెడ్డి, రామసుందర్‌రెడ్డిలను పరామర్శించారు. కొత్తూరులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు అమరనాథరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఇటీవల రాలేకపోయిన జగన్.. బుధవారం ఆయన ఇంటికి వెళ్లి కాసేపు గడిపారు. సమీపంలో ఉన్న వెంకట్రామిరెడ్డి ఇం టికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తర్వాత పెండ్లిమర్రి మండలం గొందిపల్లెకు వెళ్లిన జగన్‌కు ఘన స్వాగ తం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న మార్కెట్ యార్డు మాజీ చెర్మైన్ చంద్రహాసరెడ్డి తండ్రి రామచెన్నారెడ్డిని పరామర్శించారు.

అనంతరం పులివెందులలోనిఇస్లాంపురంలో తండ్రి మృతి చెంది బాధలో ఉన్న మైనార్టీ నాయకుడు సాదక్‌వల్లిని పరామర్శిం చారు. రెండు నెలల క్రితం జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లి ఖలీల్ అనే వ్యక్తి అక్క డ మృతి చెందాడు. పులివెందులలో నివాసముంటున్న ఖలీల్ భార్య ఆరిఫున్నీషాను వైఎస్ జగన్ పరామర్శించారు. పులివెందుల మండలం రాయలాపురంకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేత విజయభాస్కర్‌రెడ్డి(బాబు), లక్ష్మిదేవిల కుమార్తె నందిని, సందీప్‌ల నిశ్చితార్థం స్థానిక వీజే కళ్యాణ మండపంలో బుధవారం జరిగింది. మధ్యాహ్నం ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా వ ర్ధిల్లాలని ఆకాంక్షించారు.

  అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడుతూ..
   వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి బయలుదేరగానే దారి మధ్యలో క్వానాయ్‌ని మహిళలు ఆపుతూ ఆయనతో కరచాలనం చేశారు. ప్రతిచోట వైఎస్ జగన్ వాహనం దిగి వారికి అభివాదం చేస్తూ.. ఆత్మీయంగా పలకరించారు. తంగేడుపల్లె, యు.రాజుపాలెం, కొత్తూరు, బాలయ్యగారిపల్లె, శాంతిపురం, గొందిపల్లె తదితర గ్రామాల వద్ద వృద్ధులు, మహిళలు, యువకులతో వైఎస్ జగన్ కరచాలనం చేశారు. బాలయ్యగారిపల్లె, శాంతిపురం వద్ద ఉపాధి కూలీలతో మాట్లాడారు. కూలి గిట్టుబాటు, పని దినాల గురించి అడిగి తెలుసుకున్నారు.

   పర్యటన విజయవంతం
 వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు ప్రజలతో మమేకమయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీకి చెందిన పలువురు నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. మధ్యాహ్నం తర్వాత జగన్ మూడు రోజుల పర్యటన ముగించుకుని బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటనతో ఆ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది.
Share this article :

0 comments: