జగన్ అనే వ్యక్తి వెళ్లిన తర్వాతే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అనే వ్యక్తి వెళ్లిన తర్వాతే...

జగన్ అనే వ్యక్తి వెళ్లిన తర్వాతే...

Written By news on Tuesday, August 25, 2015 | 8/25/2015


చంద్రబాబు మారాలి: వైఎస్ జగన్
మచిలీపట్నం :  కొత్త మాజేరులో 18 మంది విష జ్వరాలతో చనిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విష జ్వరాల బాధితులను ఆదుకోవాలంటూ ఆయన మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
 
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే...'కొద్దిరోజుల క్రితం మాజేరు గ్రామానికి నేనే వెళ్లాను. నేను వెళ్లే సమయానికి ఆ గ్రామంలో 18మంది చనిపోయారు. 18మంది ఆ గ్రామంలో చనిపోయినా పట్టించుకోనే పరిస్థితిలో  ప్రభుత్వానికి లేదు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ గ్రామానికి వెళ్లి... చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించాలి. సీఎం కాదు కదా.. కనీసం ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆ గ్రామానికి వెళ్లిన పాపాన పోలేదు.

జగన్ అనే వ్యక్తి వెళ్లిన తర్వాతే... ఆరోగ్య శాఖ మంత్రి వెళ్లారు. నాలుగు రోజుల తేడాతో అయిదుగురు చనిపోయారు. కనీసం చనిపోవడానికి కారణాలు కూడా తెలుసుకోలేదు. వాటర్ ట్యాంక్ లో పడి కోతులు చనిపోయి...కుళ్లిపోయాయి. ఆ నీటినే గ్రామస్తులు తాగారు. ట్యాంక్ లను క్లీన్ చేశారా? లేదా అనే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. మూడు నెలల వ్యవధిలోనే 19మంది చనిపోయినా చంద్రబాబు పట్టించుకోరు. చంద్రబాబు నిద్ర మేల్కొని  చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండటం లేదు. డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని మామూలుగా చనిపోయారంటూ చంద్రబాబు వారిని కించపరుస్తున్నారు.
Share this article :

0 comments: