షర్మిల రెండో విడత పాదయాత్ర 7 నుంచి 11 వరకు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల రెండో విడత పాదయాత్ర 7 నుంచి 11 వరకు..

షర్మిల రెండో విడత పాదయాత్ర 7 నుంచి 11 వరకు..

Written By news on Sunday, September 6, 2015 | 9/06/2015


ఇచ్చిన మాట కోసమే..
షర్మిల రెండో విడత పాదయాత్ర 7 నుంచి 11 వరకు..
31 కుటుంబాలకు పరామర్శ
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి

తొర్రూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని నల్లకాల్వలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట కోసమే ఆయన సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జి కొండా రాఘవరెడ్డి అన్నారు.

శనివారం తొర్రూరు మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధిత కుటుంబాల పరామర్శ కోసం వరంగల్ జిల్లాలో రెండో విడత యాత్ర ఈ నెల 7న పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలోని గంట్లకుంట గ్రామంలో ప్రారంభమై, 11న భూపాలపల్లి మండలంలోని ఇసిపేటలో ముగుస్తుందన్నారు.  పరామర్శ యాత్రలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు.

రాజకీయాలకు అతీతంగా పాల్గొనండి..
షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు మునిగాల విలియమ్స్, గుడూరు జయపాల్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, జిడిమేట్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: