ప్రజల చేతికి ప్రశ్నాస్త్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల చేతికి ప్రశ్నాస్త్రం

ప్రజల చేతికి ప్రశ్నాస్త్రం

Written By news on Monday, September 14, 2015 | 9/14/2015


ప్రజల చేతికి ప్రశ్నాస్త్రం
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? సీఎం బాబును ప్రశ్నిద్దాం-నిలదీద్దాం అంటూ ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అందుకు సంబంధించి రూపొందించిన కరపత్రాలను ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ  ఊళ్లల్లోకి వస్తున్న బాబును ఆయన మంత్రులను ఎక్కడికక్కడ నిలదీసేందుకు దాదాపు 20 ప్రశ్నలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో బాబు హామీ లు, మోసాలను సూటిగా ప్రశ్నించింది. ఆయన వల్ల రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాలు పడుతున్న బాధలను కళ్లకుకట్టింది. అంతేగాక ప్రత్యేక హోదాపై ఆయన ఆడుతున్న దొంగ నాటకాన్ని బయటపెట్టింది. సొంత ప్రయోజనాల కోసం హోదానే పణంగా పెట్టడాన్ని ఎండగట్టింది.

  వ్యవసాయ రుణాలను బేషరతుగా, పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రతి సభలో చెప్పిన చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా?

   చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాక ముందు వరకు రూ.1లక్ష లోపు రుణాలపై వడ్డీలేని పరిస్థితి. రూ.3లక్షల వరకు అయితే పావలా వడ్డీకే రుణాలు రైతులకు లభించేవి. ఎన్నికల సమయంలో బాబు మాటలు నమ్మి వ్యవసాయ రుణాలు చెల్లించనందువల్ల ఇప్పు డు మీరంతా 14 నుంచి 18 శాతం వరకు అపరాధ వడ్డీగా కడుతున్న మాట వాస్తవంకాదా?

  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లు. ఈ మొత్తం మీద రైతన్నలు ఏడాదికి రూ. 12 వేలకోట్లు అపరాధ వడ్డీ... ఈ 18  నెలల్లో రూ. 18వేల కోట్లు అపరాధ వడ్డీ కట్టాల్సి రావడం వాస్తవం కాదా?

   పూర్తిగా రుణ మాఫీ చేస్తానన్న చంద్రబాబు రైతుల్ని మోసం చేస్తూ గత రెండేళ్లలో .. నిరుడు కేవలం రూ.4,600 కోట్లు, ఈ ఏడాది కేవలం రూ.2900 కోట్లు కేటాయించ డం.. ఈ మొత్తం అపరాధ వడ్డీలో సగానికి కూడా సరి పోదన్నది   నిజం కాదా? వడ్డీలే రూ.18,000 కోట్లకు చేరుతున్నాయి.

  చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదు. అధికారంలోకి వచ్చిన బాబు రుణమాఫీ చేయకపోవడం వల్ల రుణాలు రెన్యువల్ కాలేదు. దాని ఫలితంగా రైతులకు పంటల బీమా కూడా దక్కలేదన్నది వాస్తవం కాదా?

  మీ మెడలో పుస్తెలతో సహా బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన వారందరి బంగారాన్ని అధికారంలోకి వచ్చిన నెలలోపే విడిపిస్తానని చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. ఇప్పుడ ప్రతిబ్యాంకూ రైతుల బంగారాన్ని వేలం నోటీసులు ఇస్తుంటే, వేలం వేస్తుంటే బంగారం రుణాలు కట్టకుండా, పుస్తెలు విడిపించకుండా ఈ పెద్దమనిషి ఏంచేస్తున్నారు?

  డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారా? లేదా?

  డ్వాక్రా సంఘాలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా పొదుపు సొమ్ము కూడా బ్యాంకులు జమ చేసుకోవటం వాస్తవం కాదా?
  డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తాము పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణం మీద వడ్డీ కట్టనక్కరలేని (0శాతం వడ్డీ) పరిస్థితి నుంచి 18 నుంచి 24 అపరాధ శాతం వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా?

  డ్వాక్రా సంఘాల వారిని మోసం చేస్తూ, రూ. 3000 చొప్పున బ్యాంకుల నుంచి అప్పు రూపేణా రుణం తీసుకోండి అని చెప్పడం దారుణం కాదా?

  దేశ చరిత్రలోనే ఏనాడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేరే రాష్ట్రంలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొనగోలు చేయిస్తూ అడ్డంగా దొరికిపోయారు. పట్టిసీమ ద్వారా నీరుకాదు నిధులు పారిం చారు. నదుల అనుసంధానం అని మాయ మాటలు చెపుతూ ప్రభుత్వ నిధుల్ని తన జేబుల్లోకి పారేలా నిధుల సంధానం చేసుకున్నారు. జీవో నంబర్ 22 ద్వారా కాంట్రాక్టర్లకు వేల కోట్లు పారించటం, కొందరు పారి శ్రామిక వేత్తలకు మాత్రమే రూ.2000 కోట్లకుపైగా అడగకుండానే వరాలు ఇవ్వడం, ఊరూరా ఇసుక దోపిడీ, ముడుపులు ముట్టచెప్పిన కొందరికే మద్యం లెసైన్సులు, వేల కోట్ల బొగ్గు కుంభకోణం, గ్యాస్ విద్యుత్తు కేంద్రాలకు వేల కోట్ల వ్యాట్ రాయితీలు... ఇలా విచ్చలవిడిగా చేసిన అవినీతి డబ్బుతో వేరే రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవ టం వాస్తవం కాదా? ఆ టేపుల్లో మాటలు తనవి కావా? మూటలు మోసుకువెళ్లి డబ్బు ఇస్తూ పట్టుబడినది తన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాదా? ఆ డబ్బు తనది కాదా? ఈ కేసు నుంచి బయటపడేందుక రాష్ట్రాన్ని పణంగా పెట్టి ప్రత్యేక హోదాను వదిలేయటం దారుణం కాదా?

  పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో అయిదేళ్లు పడుతుందంటున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే రిజర్వాయర్‌లోనే 90 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడంతోపాటు ఏటా దాదాపు 300కు పైగా టీఎంసీల నీటిని ఉపయోగించుకునే వీలుం డేది. పోలవరం కట్టకుండా అడ్డుపడుతున్నది, వందల కోట్ల కోసం పట్టిసీమను చేపట్టినది నిజం కాదా? పోలవరం ప్రాజెక్టు కట్టడం మీద చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదంటూ కేంద్ర ప్రభుత్వం బాబు ప్రభుత్వానికి ఉత్తరం రాసినది నిజం కాదా ? పనికిరాని కంపెనీ అని తెలిసినా తన ముడుపుల కోసం తన పార్టీ ఎంపీకి ఇదే పోలవరం ప్రాజెక్టు కోసం రూ.290 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారన్నది నిజం కాదా?

  రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడుతోంది. బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనావృష్టే. ఇన్‌పుట్ సబ్సిడీని కూడా రైతులకు అందించడం లేదు. ఎన్నికలకు ముందు మాట ఇచ్చిన విధంగా, 2013-14కు సంబంధించి ఇవ్వాల్సిన రూ.1650 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇచ్చేది లేదని తెలుగుదేశం మంత్రి శాసన సభలో ప్రకటించారు. ఆ తరువాత, 2014-15 పంబంధించి రూ. 1700 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా ఇవ్వాలని 13 జిల్లాల కలెక్టర్లు నివేదిక ఇస్తే... రూ.1067 కోట్లు ప్రకటించి, ఆ తరువాత దాన్ని రూ. 692 కోట్లకు తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు మంత్రిమండలి తీర్మానించిందంటే... అందులో కూడా కేవలం రూ.290 కో ట్లు మాత్రమే విడుదల చేసిందంటే... ఇంతకం టే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంటుందా ?

► రాయలసీమ ప్రయోజనాలను గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంతో పోటీపడి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఖాళీ చేస్తూ... కనీసం 854 అడుగులు ఉండాల్సిన ప్రాజెక్టు నీటి మట్టాన్ని పాటించకుండా విద్యుత్తు ఉత్పత్తి కోసం ఎడా పెడా నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఎన్నడూ లేని విధంగా, బాధ్యతా రహితంగానీటిని వదిలి శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 796 అడుగుల దిగువకు పడిపోయేలా చేశారు.  ఇలా దాదాపు 73 టీఎంసీల కృష్ణానది నీరు కేసీఆర్ - చంద్రబాబుల దుర్మార్గం వల్ల రాయలసీమకు దక్కకుండా, ఆంధ్రకు అందకుండా సముద్రం పాలు అయిందనేది వాస్తవం కాదా?
► చివరికి ఆత్మహత్య చేసుకున్న రైతుల పరిహారం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుర్మార్గాన్నే ప్రదర్శించింది. రూ.5 లక్షల పరిహారం అని అసెంబ్లీలో ప్రకటించి...  చివరికి రూ.1.5 లక్షలు అది కూడా కొందరికే ఇచ్చింది. ఇంతకంటే దారుణం ఉంటుందా...?

 జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. మరి జాబు వచ్చిందా? జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తానని  ఆయన చెప్పటం వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్‌లో 1కోటీ 75లక్షల ఇళ్లున్నాయి. ఈ రూ.2000 ఎప్పటి నుంచి ఇస్తారని వారంతా అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఉందా?
 జాబూ ఇవ్వలేదు. రూ. 2000 నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోగా, బాబు ప్రభుత్వం వచ్చాక, ఉన్న ఉద్యోగాలు వేల సంఖ్యలో ఊడగొట్టటం వాస్తవం కాదా?

 ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఏం చెప్పారు? అయిదేళ్లు కాదు ... పదేళ్లు తీసుకువస్తాం, దాని వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ప్రత్యేక హోదా సంజీవని కాదు.. అని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం దారుణం కాదా?

 ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మంచిదని చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడే చేస్తున్నారు. ప్యాకేజీకి అర్థం- అవి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం చట్టప్రకారం మన రాష్ట్రానికి ఇస్తానన్న నిధులు

 అనే కదా?  ఆ నిధులు మనకు రావటం మన హక్కు కదా? అవే నిధులకు ప్యాకేజీ అని పేరు పెట్టి, అదేదో కొత్తగా తానేదో తీసుకువస్తున్నానని మభ్యపెట్టే  ప్రయత్నం దారుణ కాదా? ఏకంగా ప్రత్యేక హోదానే పణంగా పెట్టటం ధర్మమేనా ?

 ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావాలంటే కేంద్రంలో ఉన్న తెలుగుదేశం మంత్రుల్ని ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆపని ఎందుకు చేయడం లేదు? ఐదు కోట్ల ప్రజలున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు రాజీపడటానికి, తన ముఖ్యమంత్రి పదవి ఊడిపోకుండా పాకులాడుతున్నాడనడానికి ఇది నిదర్శనం కాదా ?
Share this article :

0 comments: