అబద్ధాల్లో తండ్రిని మించిన వారసత్వం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అబద్ధాల్లో తండ్రిని మించిన వారసత్వం..

అబద్ధాల్లో తండ్రిని మించిన వారసత్వం..

Written By news on Tuesday, September 29, 2015 | 9/29/2015

అబద్ధాల్లో తండ్రిని మించిన వారసత్వం..
 
రెండెకరాల నుంచి అక్రమార్జనతో వేల కోట్లకు
ఏ విచారణా జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డ బాబు
విచారణ జరిగితే కదా... దోషులో నిర్దోషులో తేలేది
కొనుగోలు విలువలంటూ ఆస్తులపై అడ్డంగా బుకాయింపులు
కిలో వెండి విలువ కూడా రూ.3,400కు కొన్నట్టు చెప్పిన లోకేశ్
ఇప్పటి ధర రూ.35,000. లోకేశ్ చెప్పిన ధర ఎప్పుడుందో మరి...?
ఇసుక నుంచి బొగ్గు దాకా... పోలవరం నుంచి పట్టిసీమ దాకా అక్రమార్జనే
ముడుపుల సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిన బాబు
అయినా సరే బుకాయిస్తూ... ఆస్తుల ప్రకటన పేరిట డ్రామాలు
నేను వేసిన కేసును కూడా నీరుగార్చిన తీరు గుర్తుకొస్తోంది
బాబు ఆస్తుల ప్రకటనపై ‘సాక్షి’కి లేఖ రాసిన నందమూరి లక్ష్మీపార్వతి

 
నారా లోకేశ్ తన ఆస్తులు, తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ఆస్తులంటూ చేసిన ప్రకటన చూశాక అనేక మంది పాత్రికేయులు, భిన్న రంగాల నిపుణులతో చర్చించాను.  కొంత సమాచారాన్నీ సేకరించాను. దాదాపు దశాబ్దం క్రితమే చంద్రబాబు నాయుడి ఆస్తులపై ఏసీబీకి నేనిచ్చిన ఫిర్యాదు... తదుపరి కోర్టులో కొనసాగిన కేసు... ఆ కేసు దర్యాప్తు జరగక ముందే వేరే కారణాల వల్ల పక్కకుపోయిన విధానం... అన్నీ గుర్తుకు వచ్చాయి. ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై న్యాయస్థానం కాదు కదా...  కనీసం కానిస్టేబులు విచారణ కూడా జరగలేదు. రెండెకరాల నుంచి వేల కోట్లకు ఇంటా బయటా పడగలెత్తిన ఈ కుటుంబం అధికారంలోకి వచ్చిన తరవాత పట్టిసీమ మొదలు రాజధాని వరకు, ఇసుక మొదలు మద్యం లెసైన్సుల వరకు అధికారమే పెట్టుబడిగా చేస్తున్న సంపాదనను యావత్ తెలుగుజాతీ గమనిస్తోంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కోట్లు ధారపోసి కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన వైనాన్ని మొత్తంగా దేశం అంతా చూసి నివ్వెరపోయింది. వారి లెక్క ప్రకారమే నలుగురు ఎమ్మెల్యేలను కొనాలన్నా రూ.20 కోట్లు పెట్టి ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు ఆస్తులు మొత్తం ఎంతంటే కేవలం రూ.42 లక్షలని లోకేశ్ చెపుతున్నాడు. తండ్రి ఆస్తులకు తనయుడు ఇస్తున్న ఈ సర్టిఫికెట్‌ను చూస్తే చంద్రబాబు నాయుడు లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న వారసుడు వచ్చాడని మాత్రం రూఢి అవుతోంది. కాబట్టే, తమ ఆస్తులంటూ ఏటా చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో భిన్న వాస్తవాలను, వారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలను ఈ రూపంలో సాక్షికి సమర్పించాను.

కన్న తల్లిదండ్రులంటే ఎవరికైనా గౌరవమే. ఏవైనా చేయకూడని పనులు చేసేటపుడు వాళ్లకు తెలియకూడదనే అనుకుంటారు. కానీ తల్ల్లి పేరిటే చట్ట విరుద్ధమైన పనులు చేయగలిగేది మాత్రం చంద్రబాబు నాయుడే. తల్లి పేరిట ఆస్తులు కొని... తన అక్రమ సంపాదనకు ఆమెనే బినామీని చేసిన చరిత్ర ఆయనది. 1979లో బాబు ఎమ్మెల్యే కాక ముందు ఆయన తండ్రి ఖర్జూర నాయుడికున్న ఆస్తి కేవలం 20 గుంటలు. అంటే అర ఎకరం. తల్లి అమ్మణ్ణమ్మ ఆస్తి రెండున్నర ఎకరాలు. బాబు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎనిమిదేళ్లు గడిచాక... 1988 నాటికి ఈ భూమి 77 ఎకరాలయింది. ఇంకో పదేళ్ళకు.. అంటే 1994 నాటికి 19 కోట్ల రూపాయలకు చేరింది. అలా పెరుగుతూ... 2004లో రూ.39 కోట్లకు... 2009లో ఏకంగా రూ.51 కోట్లకు చేరిపోయింది. కాకపోతే ఇవన్నీ స్వయంగా చంద్రబాబు ప్రమాణపూర్వకంగా చెప్పిన అఫిడవిట్ లెక్కలు. వాటి వాస్తవ విలువలు... బినామీల పేరిట ఉన్న ఆస్తులు చూసినా అవెప్పుడో కొన్ని వేల కోట్ల రూపాయల్ని దాటిపోయాయి.

తల్లి పేరిట బినామీ ఆస్తులు...
 చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మకు పసుపు కుంకుమలుగా పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి రెండున్నర ఎకరాలు. దానిపై వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోదు. అలాంటి అమ్మణ్ణమ్మ 2000వ సంవత్సరంలో రూ.75 లక్షలు పెట్టి ఆస్తులు కొన్నారు. హైటెక్ సిటీ సమీపంలోని మదీనాగూడలో రూ.40 లక్షలు పెట్టి ఐదెకరాల స్థలాన్ని... బంజారాహిల్స్‌లో రూ.35 లక్షలు పెట్టి 1,135 చదరపు గజాల స్థలాన్ని కొన్నారు. మళ్లీ ఏడాది తిరక్కుండానే ఆ రెండింటినీ చంద్రబాబు తనయుడైన లోకేశ్‌కు ప్రేమతో గిఫ్ట్‌గా ఇచ్చేశారు. అమ్మణ్ణమ్మ తన సొంత సొమ్ముతో ఆ ఆస్తుల్ని కొని ఉంటే... తన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలను వదిలిపెట్టి లోకేశ్ ఒక్కడికే బహుమతిగా ఎందుకిస్తారు? అవి బాబు అక్రమాస్తులని చెప్పటానికి ఇది చాలదా?

మనీ లాండరింగ్ లావాదేవీలు..
 మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఐదెకరాలు కొన్నది బాబు బినామీగా, బాబు కంపెనీల్లో డెరైక్టర్‌గా వ్యవహరించిన నాగరాజానాయుడి బంధువుల నుంచే. ఎందుకంటే ఆ 5 ఎకరాల్ని ఆనుకుని ఉన్న మరో ఐదెకరాల్ని తన బంధువుల నుంచే నాగరాజానాయుడి భార్య సుధాశారద కొన్నారు. తరవాత ఆమె దాన్ని చంద్రబాబు భార్య భువనేశ్వరికి విక్రయించేశారు. అలా... మొత్తం పదెకరాల భూమీ చంద్రబాబు చేతికి వచ్చేసింది. అలాగే అమ్మణ్ణమ్మ రూ.35 లక్షలు పెట్టి బంజారాహిల్స్‌లో కొన్న స్థలాన్ని లోకేశ్‌కు బహుమతిగా ఇచ్చాక... ఆయన దాన్ని నాగరాజా నాయుడి మామ సత్యనారాయణకు విక్రయించారు. ఏడాది తిరక్కుండానే ఆయన దాన్ని నాగరాజానాయుడి భార్యకు బహుమతిగా ఇచ్చేశారు. ఇవన్నీ బినామీ, మనీలాండరింగ్ లావాదేవీలని తెలియటం లేదా?
 
ఆది నుంచీ అబద్ధాలే..
 1988లో కర్షక పరిషత్‌కు బాబు నియామకాన్ని సవాలు చేస్తూ రైతు నేత పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి పిటిషన్ వేశారు. దానికి జవాబుగా బాబు అఫిడవిట్ వేశారు. ‘‘నేను సంప్రదాయ రైతు కుటుంబం నుంచి వచ్చా. మా కుటుంబానికి 77.4 ఎకరాల భూమి ఉంది. 1986 నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుంబానికి రూ.2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాక నేను స్వయంగా కూలీల్ని పెట్టి సాగు చేశా. ఏడాదికి రూ.36,000 ఆర్జించా’’ అని దాన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టడం... ఎన్టీఆర్ కుమార్తెను వివాహమాడటం తప్ప బాబుకు ఇతర వ్యాపారాలేవీ లేవు. అలాంటిది 1992-93 నాటికి హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. ఏడాదికి రూ.36,000 ఆర్జించిన బాబు ఆరేళ్లలో అంత డబ్బెలా సంపాదించారు? భువనేశ్వరి కార్బయిడ్స్ కంపెనీ పెట్టి దివాలా తీసి, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారు తప్ప ఏ వ్యాపారంమీదా రూపాయి కూడా సంపాదించిన దాఖలాలు లేవు. మరి అంత డబ్బు ఎలా వచ్చింది?

 1999 నాటికి రూ. 7.7 కోట్లకు చేరిన ఆస్తి!
 1994లో ముఖ్యమంత్రి అయిన బాబు... 1999లో తన ఆస్తుల్ని స్పీకరు ఎదుట ప్రకటించారు. తనకు రూ.7.79 కోట్ల ఆస్తులున్నట్లు దాన్లో వెల్లడించారు. అన్ని కోట్లు ఎలా సంపాదించారు? అప్పట్లో హెరిటేజ్ ఫుడ్స్ కూడా నష్టాల్నే నమోదు చేసింది. మరి బాబు ఆస్తులెలా పెరిగాయి?

 2009 నాటికి రూ. 60 కోట్లకు..
 ఫిక్స్‌డ్ డిపాజిట్ రెట్టింపు కావాలంటే ఆరేళ్లు తప్పనిసరి. కానీ బాబు ఆస్తులు ఎంత వేగంగా పెరిగాయంటే... 2004 నాటికి రూ.20 కోట్లకు చేరాయి. 2009 నాటికి ఏకంగా 60 కోట్లయ్యాయి. ఇవన్నీ బాబు ఎన్నికల అఫిడవిట్లలో చెప్పినవే!! అది కూడా బాబు తాను కొనుగోలు చేసిననాటి విలువలను మాత్రమే చెప్పారు. మరి మార్కెట్ విలువ 30 రెట్లు ఎక్కువేనన్నది అబద్ధమా? అంటే 2009 నాటికే బాబు ఆస్తి దాదాపు రూ. 2 వేల కోట్లకు చేరింది. అన్ని కోట్లు ఎలా పోగేశారు మరి?

ఇంకా ఎన్నాళ్లు ఈ లెక్కలు?
 తాము కొనుగోలు చేసిన విలువలు... అంటూ పచ్చి అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడి వారసత్వం అబద్ధాలు చెప్పటంలో ఆయన కొడుకు నారా లోకేశ్‌కి ఎంచక్కా అబ్బేసింది. లోకేశ్ చెప్పిన ప్రకారం ఆస్తుల లెక్కలివీ...

చంద్రబాబు    42 లక్షలు
భువనేశ్వరి     33.07 కోట్లు
లోకేశ్    7.67 కోట్లు
బ్రాహ్మణి    4.77 కోట్లు
నిర్వాణ హోల్డింగ్స్    1.37 కోట్లు  (అప్పులు పోను విలువ)

ఈ లెక్కన చూస్తే కుటుంబం మొత్తం ఆస్తి దాదాపు 46.5 కోట్లు. అయితే ఒక్క మదీనాగూడలోని 10 ఎకరాల స్థలం విలువే దాదాపు 200 కోట్లు పైగా చేస్తుంది. ఇక హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ విలువ రూ.905 కోట్లు. దీన్లో 60 శాతం వరకూ వాటా చంద్రబాబు, ఆయన కంపెనీలు, బినామీలదే. అంటే దీని విలువే దాదాపు 550 కోట్లు. అంటే ఈ రెండు ఆస్తుల విలువే ఏకంగా 750 కోట్లు. మరి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోను, విదేశాల్లోను ఉన్న భూములు, భవనాలు, ఇతర ఆస్తుల విలువ కూడా కలిపితే ఎన్ని వేల కోట్లవుతుంది? చంద్రబాబు నాయుడుకు విదేశీ ఆస్తులు భారీగా ఉన్నాయని షాపింగ్ కాంప్లెక్సులు, హోటళ్ళు సింగపూర్, మలేసియా దేశాల్లో ఉన్నాయని ఏనాడో తెహల్కా రాసింది. ముఖ్యమంత్రి అయ్యింది మొదలు చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు సింగపూర్ వెళ్ళి వచ్చారు. రాజధానిలో సింగపూర్ కంపెనీకి కట్టబెడుతున్న వాటా రైతులనుంచి తీసుకున్న 10,000 ఎకరాల భూమి అని గతంలో ఒక ఆంగ్ల పత్రిక రాసింది. గతంలో విదేశీ ఆస్తులకు ఇప్పుడు సింగపూర్‌లో ఇంకెన్ని సంపదలు జత కలిశాయో ఊహకు అందని విషయం. దీన్నిబట్టి ఏటా తండ్రి పాడుతున్న పాటకే లోకేష్ కూడా దరువేశాడని అర్థమవటం లేదా?

అసలు లోకేశ్ సంపాదించిందెప్పుడు?
 లోకేశ్‌ని చూస్తే అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మిలన్ యూనివర్సిటీల్లో చదవటం మినహా పెద్దగా వెలగబెట్టిన ఉద్యోగాలేవీ లేవు. ఇంటర్మీడియెట్ అత్తెసరు మార్కులతో పాసైనా అక్కడ సీట్లు వచ్చాయంటే కోట్ల రూపాయల మేర డొనేషన్లు కట్టడం వల్లే. ఆ డొనేషన్లను సైతం రామలింగరాజు అప్పట్లో సర్దుబాటు చేశారనేది అందరూ చెప్పే మాటే. అంతో ఇంతో పెద్ద ఉద్యోగమంటే ఆయన చేసింది, చేస్తున్నది హెరిటేజ్‌లోనే. మరి అలాంటి లోకేశ్ 2006-07లో ముంబై శివార్లలో 8.42 ఎకరాలు, బెంగళూరు దగ్గర 3.17 ఎకరాలు ఎలా కొన్నాడు? హెరిటేజ్‌లో వాటాలతో చూస్తే ఈయన ఒక్కడి ఆస్తే మార్కెట్ విలువల ప్రకారం 400 కోట్లకు పైగా ఉంటుంది. ఇది బాబు అక్రమార్జన కాదా?
 
ఈ కుంభకోణాలకు అంతం ఉందా?
 హైటెక్ సిటీ తరహాలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటించే ముందు అక్కడ తన కుటుంబీకులు, బినామీలు, బంధువుల పేరిట భారీగా భూములు కొని... ఆ తరవాత ప్రాజెక్టును ప్రకటించటం... పెరిగిన ధరల్ని సొమ్ము చేసుకోవటం గురించి ఈ రాష్ట్రంలో తెలియనివారెవరైనా ఉన్నారా?

బినామీ చేత ‘ఐఎంజీ భారత’ అనే డొల్ల కంపెనీ పెట్టించి... దానికి ఆగమేఘాల మీద 850 ఎకరాలిచ్చేసి... భవిష్యత్తు హక్కుల్ని కూడా ఆ సంస్థకు రాసిచ్చేసింది బాబు కాదా? ఎకరా 2 కోట్లు పలుకుతున్న చోట రూ.50 వేల చొప్పున... అదీ 850 ఎకరాల్ని ఎవరైనా ఇచ్చేస్తారా? అంతకు మూడేళ్ల కిందటే తన భార్య పేరిట అక్కడున్న భూమిని ఎకరా రూ.కోటికి విక్రయించింది బాబు కాదా?

 {పభుత్వ చక్కెర కర్మాగారాలకు, స్పిన్నింగ్ మిల్లులకు, డెయిరీలకు నష్టాల ముసుగు తొడిగి... విలువైన భూములు, భవనాలు, ఆస్తులతో సహా వాటిని చెనక్కాయలకు, పప్పుబెల్లాలకు ఇచ్చేసినట్లుగా తన బినామీలకు పంచింది బాబు కాదా? ళీ ఐటీ రిటర్న్‌ల ప్రకారం చంద్రబాబు భార్య భువనేశ్వరి 2010-11లో 13.50 కోట్లు... 2009-10లో  6.58 కోట్లు... 2008-09లో 13.00 కోట్లు ఆదాయం సంపాదించారు. దానిపై రూ.7 కోట్ల పన్ను కూడా కట్టారు. మరి లోకేశ్ ఆమె మొత్తం ఆస్తుల విలువ 33 కోట్లని చెప్పారు. ఇదేమైనా నమ్మశక్యంగా ఉందా?

అదే ఐటీ రిటర్న్‌ల ప్రకారం 2008-09 లోకేశ్ ఆదాయం రూ.86,350. దానిపై కట్టిన పన్ను రూ.4,280. తరవాత హెరిటేజ్ ఫుడ్స్‌లో చేరటంతో జీతం మొదలైంది. 2009- 10లో రూ.29.27 లక్షలు, 2010-11లో రూ.37.18 లక్షలు ఆదాయంగా చూపించారు. మరి  మైనర్‌గా ఉన్నప్పుడే నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో మొదలెట్టి... మదీనాగూడ, కొండాపూర్. బెంగళూరు, ముంబైలలో ఎకరాలకు ఎకరాలు లోకేశ్ ఎలా కొన్నారు. అది చంద్రబాబు అక్రమ సంపాదన కాదా?

ఎన్టీఆర్ ట్రస్టు కూడా బాబు ఆస్తేగా?

బాబు కుటుంబం ఎప్పుడు ఆస్తులు ప్రకటించినా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆస్తుల ఊసే రాదు. ఎందుకంటే అది ట్రస్టు కనక. కానీ బంజారాహిల్స్‌లో భారీ భవంతితో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్నది దీని పేరిటే. ఈ ట్రస్టుకు చంద్రబాబు శాశ్వత ట్రస్టీ. ఆయన భార్య భువనేశ్వరి, వారి కుటుంబ ఆడిటర్ దేవినేని సీతారామయ్య మిగిలిన ట్రస్టీలు. బంజారాహిల్స్‌లో భవంతిలోని కార్యకలాపాలు సాగిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ ఈ ట్రస్టుకు ఏటా కొంత రుసుము కూడా చెల్లిస్తోంది. సీఎంగా ఉన్నపుడు తన ట్రస్టుకు తనే భూమిని కేటాయించుకుని, తనే సెట్లర్‌గా, తనే ట్రస్టీగా రాసుకుని చంద్రబాబునాయుడు స్వయంగా ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ ఇది. దీన్లోని మిగిలిన ట్రస్టీల్ని బయటకు పంపేసి చివరికి తన కుటుంబం చేతుల్లోకి తెచ్చుకున్నారు.  దీన్ని బాబు ఆస్తిగా ఎందుకు లెక్కబెట్టకూడదు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యపట్టణాలన్నింటిలో ట్రస్టు పేరిట భూములు స్వాహా చేసే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతోంది.
 
అవినీతి సొమ్ముతో దేనికైనా రెడీ...
అధికారంలోకి రావటం... ఎడాపెడా అవినీతికి పాల్పడి దేశంలోను, విదేశాల్లోను భారీ ఆస్తులు కూడబెట్టడం... బినామీలకు దోచిపెట్టడం... అధికారం నిలబెట్టుకోవటానికి, మళ్లీ అధికారంలోకి రావటానికి ఆ బినామీల డబ్బును విచ్చలవిడిగా వెదజల్లటం... ఇదే బాబు వ్యవహార శైలి. పట్టిసీమ ప్రాజెక్టులో దక్కిన ముడుపులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదాకా కొట్టుకు వచ్చాయంటే ఏమనుకోవాలి? పట్టిసీమ నుంచి పోలవరం దాకా, ఇసుక నుంచి బొగ్గు దాకా, ఎంపిక చేసిన వారికి పారిశ్రామిక రాయితీలు మొదలు కొందరికే మద్యం ఉత్పత్తి పెంపు లెసైన్సుల వరకు ప్రతి ఒక్క అంశంలోనూ విచ్చలవిడిగా పుచ్చుకున్న ముడుపులతో వందల కోట్లు కుమ్మరించి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోవటం నిజం కాదా? దాన్ని కప్పి పుచ్చుకోవటానికి పైస్థాయిలో తెలిసిన వాళ్ల కాళ్లు పట్టుకుని, నానా యాతనా పడుతూ బయటకు బీరాలు పోవటం తెలియని విషయమా? అంతెందుకు! ఈ బాబు ఇసుక మాఫియాకూ లీడరే. కృష్ణా జిల్లాలో టీడీపీ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ ఇసుక దందాను అడ్డుకోబోయిన మహిళా తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చి పడేశారంటే వీళ్ల దారుణాల గురించి ఏమని చెప్పుకోవాలి? ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉండే తుని నియోజకవర్గంలో ఇసుక దందాను అడ్డుకున్నందుకు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై ఏకంగా దాడికే దిగారు.

పట్టిసీమ, పోలవరం పేరిట కోట్లు దండుకుంటున్నారు. ఇక ప్రాజెక్టుల్లో మేత కోసం జీవోలు సైతం విడుదల చేస్తున్నారు. రాజధాని పేరిట మళ్లీ సింగపూర్ మంత్రం పఠిస్తూ బినామీలకు భూములు, కాంట్రాక్టులు పందేరం చేయడానికి సిద్ధమయ్యారు. కమిషన్ల కోసం పారిశ్రామిక వేత్తలకు ఏకంగా రూ.2,067 కోట్ల మేర నజనారాలు ప్రకటించారు. ఏం! వీటిలో మీ పార్టీ వాళ్లకు ప్రాధాన్యమివ్వటం నిజం కాదా? ఎంపిక చేసిన కొన్ని డిస్టిలరీలకు మాత్రమే మద్యం ఉత్పత్తి పెంచుకోవచ్చంటూ జీవో ఇచ్చేశారు. బెరైటీస్ టెండర్లలో మార్పులతో భారీ కుంభకోణానికి టెంకాయ కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతూ పొంతూ ఉందా? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా గడవలేదు. వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడ్డారు. పెపైచ్చు మాకెలాంటి అవినీతి మకిలీ అంటలేదు... మేం చాలా సత్యహరిశ్చంద్రులం అన్నట్టుగా ఏడాదికోసారి నాలుగు కాగితాలు చెప్పి ఆస్తుల్ని ప్రకటించటం!!. అసలు మీకేమైనా చిత్తశుద్ధి ఉందా? ఉంటే మీ ఆస్తుల తాలూకు నిజమైన విలువలు చెప్పొచ్చుగా? మార్కెట్ విలువలు చెప్పొచ్చుగా? ఎప్పుడో 1995లో మీరొక ఇల్లు 23 లక్షలు పెట్టి కొన్నారని ఇప్పటికీ దాని విలువ 23 లక్షలే అని చెబితే నమ్మేదెవరు? రూ.50 కోట్లు విలువ చేసే ఆ బిల్డింగ్‌ను ఎవరైనా రూ.50 లక్షలిస్తామంటే మీరు అమ్మేస్తారా? ఎందుకిన్ని అబద్ధాలు? ఎన్నాళ్లీ అబద్ధాలు? ఇలా చెబితే మీ కుటుంబాన్ని నమ్మేదెవరు బాబూ?
http://www.sakshi.com/news/sakshi-special/assets-of-nara-lokesh-babu-279981?pfrom=home-top-story
Share this article :

0 comments: