పర్యటన సాగుతుంది ఇలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పర్యటన సాగుతుంది ఇలా..

పర్యటన సాగుతుంది ఇలా..

Written By news on Tuesday, September 15, 2015 | 9/15/2015


హోదాపై సమర భేరి
నేడు తిరుపతికివైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాక
ఉదయం పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో విద్యార్థుల సదస్సు
మధ్యాహ్నం పీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర మహాసభ


తిరుపతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేం దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న సమరభేరిలో భాగంగా మంగళవారం ఉదయం తిరుపతికి రానున్నారు. ‘ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి’ అనే అంశంపై విద్యార్థులతో ఏర్పాటు చేస్తున్న సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనం, విద్యార్థులకు లభించే ఉద్యోగావకాశాలపై చర్చించనున్నారు. ప్రత్యే క హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై విద్యార్థులతో కలిసి సమరభేరి మోగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తనపల్లె క్రాస్ వద్ద ఉన్న పీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో జరగనున్న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో పాల్గొంటారు.

 పర్యటన సాగుతుంది ఇలా..
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. 10.15 గంటలకు పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో విద్యార్థులు నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో పాల్గొంటారు.

నగరంలో భారీ ఏర్పాట్లు..
జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతికి రానున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లుచేశారు.  తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో విద్యార్థులు మరింత పట్టుదలతో సదస్సును సక్సెస్ చేసేందుకు పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో భారీ ఏర్పాట్లు చేశారు. సదస్సుకు భారీఎత్తున విద్యార్థులు హాజరుకానున్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్టీసీ కార్మికులు తనపల్లె క్రాస్‌లోని పీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో మహాసభకు ఏర్పాట్లు చేశారు.

 ఏర్పాట్లను పర్యవేక్షించిన నేతలు..
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సోమవారం సాయంత్రం పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో విద్యార్థుల సదస్సు జరిగే వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. రాత్రి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మేధావులు, విద్యావేత్తలతో సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ సలాం బాబు పర్యవేక్షించారు. నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాపరెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకుడు బీరేంద్రవర్మ, పోకల ఆశోక్‌కుమార్ పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: