రోజూ భోంచేసి నిరాహారదీక్ష చేశా రా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోజూ భోంచేసి నిరాహారదీక్ష చేశా రా?

రోజూ భోంచేసి నిరాహారదీక్ష చేశా రా?

Written By news on Sunday, September 27, 2015 | 9/27/2015


7 నుంచి వైఎస్ జగన్ నిరవధిక దీక్ష
చంద్రబాబు 2010లో హైదరాబాద్‌లో, ఆ తర్వాత ఢిల్లీలో నిరాహార దీక్ష ఎలా చేశారు? ప్రతిపక్ష నేతగా, సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఈ మాత్రం తెలియ దా..’ అని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో చేసిన దీక్షలు చావడం కోసమే చేశా రా? లేక రోజూ భోంచేసి నిరాహారదీక్ష చేశా రా? అని బొత్స తీవ్రంగా మండిపడ్డారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 7 నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించినట్టు పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి  భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్టీ ఇతర నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 చంద్రబాబు దీక్షలు ఎలా చేశారు?
 ‘చస్తానని దరఖాస్తు చేసుకుంటే అనుమతివ్వాలా? దీక్ష చేయడం చట్టబద్ధం కాదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. ‘నిరవధిక నిరాహారదీక్ష చేయడమనేది చట్టబద్ధం కాదా?

హోదా కోసం దీక్ష చేయాల్సింది రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో అని బాబు చెప్పడం పిచ్చి మాటలని, తమ పార్టీ ముందుగా ఢిల్లీలో ధర్నా చేసిన విషయం ఆయనకు తెలియదా.. అని ఢిల్లీలో జగన్ చేసిన దీక్షను బొత్స గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల కోసం, నిరుద్యోగ యువత భవిత కోసం ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందుల ను ఎదుర్కోవడానికైనా తాము సిద్ధమని అం దుకే దీక్ష విషయంలో ఒక మెట్టు దిగి ప్రదేశాన్ని వేరే చోటుకు మార్చుకుంటున్నామని చెప్పారు. పోలీసులు చెప్పిన విధంగా ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషిస్తున్నామని వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అనుమతిని ఇవ్వాలన్నారు.

 రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు: సీఎంపై అనంత ధ్వజం
 రాష్ట్రం 16 నెలల పసిపాప అని చెబుతున్న సీఎం చంద్రబాబు ఆ పసిపాప ఏమీ చేయలేదని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శిం చారు. రాజధాని పేరుతో బాబు  రైతుల నుంచి లాక్కున్న భూములను సింగపూర్ ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసి తద్వారా ఇక్కడ పచ్చచొక్కాలకు చెందిన కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం 2014-15లో కేంద్రం రూ.1,500 కోట్లు ఇస్తే  ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడమేమిటని ప్రశ్నించారు.హోదా కోసం ప్రధాని మోదీపైఒత్తిడి తేవాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఈ వ్యవహారాన్ని జగన్‌తో సహా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నందుకే బాబు అందరిపై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు.
Share this article :

0 comments: