రేపు బందరులో జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు బందరులో జగన్ పర్యటన

రేపు బందరులో జగన్ పర్యటన

Written By news on Tuesday, September 15, 2015 | 9/15/2015


రేపు బందరులో  జగన్ పర్యటన
మచిలీపట్నం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం బందరు మండలంలో పర్యటిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, అధికార ప్రతినిధి పేర్ని నాని ఒక ప్రకటనలో తెలిపారు. పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం ప్రభుత్వం 30వేల ఎకరాల భూమిని సేకరిస్తామని చెప్ప టం, ఇప్పటికే 14వేల ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొం దని, అనుబంధ పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదని రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతు తెలిపేందుకు జగన్  వస్తున్నారని పేర్కొన్నారు.

బుధవారం ఉదయం 8.30 గంటలకు జగన్ గన్నవరం   విమానాశ్రయానికి చేరుకుంటారని, 9.30 గంటలకు కరగ్రహారంలోని ఫరీద్‌బాబా దర్గా వద్ద, 11.30 గంటలకు తుమ్మలచెరువు వినాయకుడి గుడి సెంటరులో రైతులతో జగన్ మాట్లాడతారని వివరించారు. 1.30 గంటలకు పొట్లపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో సమావేశమవుతారని తెలిపారు.
Share this article :

0 comments: