దమ్మిడీ సాయం కూడా అందించట్లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దమ్మిడీ సాయం కూడా అందించట్లేదు

దమ్మిడీ సాయం కూడా అందించట్లేదు

Written By news on Thursday, September 3, 2015 | 9/03/2015


హైదరాబాద్ :రాష్ట్రంలో కరువు పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం రైతులకు దమ్మిడీ సాయం కూడా చేయడం లేదని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై అసెంబ్లీలో గురువారం సాయంత్రం జరిగిన స్వల్పకాల చర్చలో ఆయన మాట్లాడారు. ఇన్పుట్ సబ్సిడీలు సరిగా ఇవ్వడం లేదని, రైతులకు రుణ భారం విపరీతంగా పెరిగిపోతోందని, అందుకే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆయన ఏమన్నారంటే...

రాష్ట్రంలోని 556 మండలాల్లో కరువు తీవ్రంగా ఉంది
కానీ కేవలం 238 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించారు
మామూలుగా అయితే సెప్టెంబర్ మూడోవారంలో ఎన్యుమరేషన్ మొదలుపెట్టి అక్టోబర్ నాటికి కరువు మండలాలుప్రకటించాలి
కానీ డిసెంబర్ 17 రాత్రి పూట జీవో జారీచేశారు. 18 నుంచి అసెంబ్లీ ఉందనే అలా ఇచ్చారు.
అయితే రైతులకు దమ్మిడీ సాయం కూడా అందలేదు
మళ్లీ కేబినెట్ ఏప్రిల్ 22 న సమావేశమైంది
అందులో 1067 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు
కలెక్టర్లు 1500 కోట్లు కావాలని అడిగారు
కానీ అదీ ఇవ్వలేదు.. దమ్మిడీ సాయం కూడా చేయలేదు
జూలై 22 న మళ్లీ కేబినెట్ సమావేశమైంది
ఈ సమావేశంలో.. 1067 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని 692 కోట్లకు తగ్గించింది
కరువు తీవ్రత పెరుగుతుంటే సబ్సిడీ పెరగాల్సింది పోయి.. ఇలా తగ్గించేశారు
పోనీ అవైనా ఇచ్చారా అంటే అదీ లేదు
ఇచ్చింది 2014-15కు సంబంధించి కేవలం 190 కోట్లు మాత్రమే ఇచ్చారు
వారం క్రితం మరో 100 కోట్లు.. అంటే మొత్తం 290 కోట్లే ఇచ్చారు
కలెక్టర్లు 1500 కోట్లు అడిగితే చివరకు 290 కోట్లు ఇచ్చారు
ఇది కేవలం 2014-15 పరిస్థితి మాత్రమే
ఇక 2013-14లో వరుసగా తుఫానులు, కరువు వచ్చాయి. అందరం జిల్లాలకు వెళ్లాం. సహాయం చేస్తామన్న మాట ప్రతి నోట్లోంచి వచ్చింది
కానీ ఈ ప్రభుత్వం సహాయం చేసిందా అంటే.. ఏకంగా 1690 కోట్ల రూపాయలను పూర్తిగా ఇవ్వబోమని చెప్పేశారు
ఇదే శాసన సభలో లిఖితపూర్వకంగా ఆ విషయం చెప్పారు
ఒకవైపు కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు గానీ వాటిని వేరేవాటికి మళ్లిస్తున్నారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదు
ఈ సంవత్సరం విషయం తీసుకుంటే.. మంత్రిగారు చదువుతూ ఈ ఖరీఫ్ లో 554 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే, 378 ఎంఎం మాత్రమే కురిసిందన్నారు.
తీవ్రమైన కరువు ఛాయలు కనిపిస్తున్నాయన్నారు
అది వాస్తవమే. ఈ సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ లో విత్తనాలు ఎంత వేశారు, ఎంత వేయాల్సి ఉందనే లెక్కలు గమనిస్తే,
నూనె గింజలు.. 11.98 లక్షల హెక్టార్లలో వేయాలి కానీ 5.69 లక్షల హెక్టార్లలోనే వేశారు. అంటే అది కేవలం 47 శాతం
పప్పుధాన్యాలు 25.96 లక్షల హెక్టార్లలో వేయాలి 15.04 లక్షల హెక్టార్లలో అంటే 57.93 శాతమే వేశారు
వరి 16.75 లక్షల హెక్టార్లలో వేయాలి 8.54 లక్షల హెక్టార్లలో వేశారు 50.98 శాతమే అంటే 50 శాతం క్రాప్ హాలిడే ప్రకటించారు
పత్తి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.. 76 శాతం వరకు వేశారు
రైతులు ఇంత దారుణంగా పంటలు వేయకపోవడానికి ఒక కారణం ప్రకృతి అయితే రెండోది చంద్రబాబు నాయుడి పుణ్యం
ఖరీఫ్ కు 29,022 కోట్ల పంటరుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే 21,018 కోట్లు ఇచ్చారు
సాధారణంగా గతంలో ఎప్పుడూ లక్ష్యం కంటే ఎక్కువగా రుణాలు ఇచ్చేవారు
2011-12లో 48,000 కోట్లు లక్ష్యం అయితే 58,511 కోట్లు ఇచ్చారు
2012-13లో 52,972 కోట్లు అనుకుంటే 73,648 కోట్లు ఇచ్చారు
2013-14 లో 67,224 కోట్లు లక్ష్యం 73,494 కోట్లు ఇచ్చారు
చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2014-15లో 56,019 కోట్లు లక్ష్యం పెట్టుకుంటే 39,938 కోట్లు మాత్రమే ఇచ్చారు
ఈ సంవత్సరం ఖరీఫ్లో 21,018 కోట్లు మాత్రమే లక్ష్యంగా ఇచ్చారు. దీన్నిబట్టే రైతుల దుస్థితి ఏంటో తెలుస్తుంది
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రైతులకు 87 వేల కోట్ల రుణాలు ఉండేవి
కానీ మార్చి 31 నాటికి బ్యాంకర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం 95,597 కోట్లకు పెరిగినట్లు కనిపిస్తున్నాయి.
వ్యవసాయానికి సంబంధించిన లక్ష్యాల సాధన కంటే తక్కువగా ఇచ్చారు
రెండోవైపు రుణాలు మాత్రం పెరిగిపోయాయి
అంటే అప్పులు పెరిగిపోతున్నాయి, రైతులు మాత్రం అప్పులు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు
7వేల కోట్లు రుణమాఫీకి ఇచ్చామంటున్నారు
కానీ 87 వేల కోట్లకు ఈ 18 నెలలకు వడ్డీ వేసుకుంటే అది కూడా సరిపోవట్లేదు.
ఇంతకుముందు లక్ష రూపాయల వరకు రుణం వడ్డీ లేకుండా వచ్చేది
3 లక్షల వరకు అయితే పావలా వడ్డీకి వచ్చేది
కానీ ఇప్పుడు 14 శాతం వరకు అపరాధ వడ్డీ వసూలు చేస్తున్నారు
రుణాలు రెన్యువల్ కాక పంట బీమా అందని పరిస్థితి ఏర్పడింది
రైతులకు వడ్డీయే 15- 16వేల కోట్లు అవుతుంది. మీరిచ్చేది కనీసం వడ్డీలకు కూడా సరిపోవట్లేదు.
రాష్ట్రంలో ఈ ఏడాది 196 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
అనంతపురంలోనే 101 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
చనిపోయిన ప్రతి ఇంటికీ నేను వెళ్లి పరామర్శిస్తున్నా

ఈ సమయంలో పల్లె రఘునాథరెడ్డి కల్పించుకుని పట్టిసీమ ప్రాజెక్టు గురించి ప్రస్తావించగా, దానికి కూడా సమాధానం ఇస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కానీ, స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాత్రం, పట్టిసీమ గోదావరి జిలాల సబ్జెక్టు నిన్ననే అయిపోయిందని, ఈరోజు కేవలం కరువు గురించే చెప్పాలని అన్నారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలో మళ్లీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ అవకాశం ఇవ్వగా, ఆయన కూడా పట్టిసీమ అంశాన్ని ప్రస్తావించారు. దాంతో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు.. రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులున్నాయని, కరువు గురించిన వివరాలు మాత్రమే చెప్పాలని స్పీకర్ కోడెల ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్కు సూచించారు.

ఆ తర్వాత మళ్లీ వైఎస్ జగన్కు అవకాశం వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 196 మంది చనిపోయారని నేను చెబితే, మంత్రిగారు మాత్రం మమ్మల్ని భయపెట్టేలా తప్పులు చెబుతున్నారు.
మైకులు ఎలా కట్ చేస్తున్నారో కూడా ప్రజలంతా చూస్తున్నారు
ఇంతవరకు చనిపోయిన 196 మందిలో ప్రతి ఇంటికీ పోతా. వాళ్లు చెప్పే కథలు, గాధలు వినండి.. మార్చగలిగితే మార్చండి.
చనిపోయిన వాళ్లలో కొంతమందికి పరిహారం వచ్చింది, మరికొందరికి ఇవ్వలేదు
మొదట్లో 5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు అడిగితే 1.5 లక్షలు మాత్రమే అప్పుల వాళ్లకోసం ఇచ్చామంటున్నారు
మిగిలిన 3.5 లక్షలు జాయింట్ అకౌంట్ అంటున్నారు
మేం పంట వేస్తే, వేసినట్లు రుజువు చేస్తే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇస్తారట అని చెప్పారు
కానీ ఈరోజు ఆ 35 వేలు వడ్డీ కూడా రైతులకు అందడం లేదు.
చివరకు ఏ స్థాయికి వెళ్లిందంటే, 5 లక్షలు కూడా ఇవ్వడం దండగని, దాన్ని 2 లక్షలకే పరిమితం చేస్తూ జీవో విడుదల చేశారు
ఆ చనిపోయిన కుటుంబాలకు ఒక్కసారిగా డబ్బు వాళ్ల చేతుల్లో పెడితే ఉపయోగం ఉంటుంది
ఈ సమయంలో మళ్లీ వైఎస్ జగన్ మైకు కట్ అయింది.. మంత్రి పత్తిపాటి పుల్లారావు కల్పించుకున్నారు. తాము జీవో మార్చలేదని, లక్షన్నర అప్పులు తీర్చుకోడానికి, 3.5 లక్షలు కుటుంబం గడవడానికి ఇస్తున్నట్లు చెప్పారు.

తర్వాత జగన్ మాట్లాడుతూ...

నిజంగా అలా తగ్గించకపోతే చాలా సంతోషం. తగ్గించిన జీవో కాపీ కాసేపట్లో వస్తుంది.
అది పక్కన పెడితే మీరు ఇస్తామని చెబుతున్న ఈ 5 లక్షల్లో 3.5 లక్షలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్ అని పేరు చెబుతున్నారు గానీ దాంతో రైతులకు దమ్మిడీ లాభం లేదు
ఆ సమయంలో మళ్లీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కల్పించుకుని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. వైఎస్ జగన్ అవాస్తవాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్యల లెక్కలు రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానన్నారు

మళ్లీ వైఎస్ జగన్కు అవకాశం వచ్చింది

అనంతపురం జిల్లాలో 26 రోజులు ఉండి 46 ఇళ్లకు వెళ్లాను. ఇంకా అందరి ఇళ్లకూ వెళ్తాను, ఎందరికి పరిహారం అందిందో, ఎందరికి అందలేదో చెబుతాను
రాష్ట్ర విపత్తు నివారణ నిధుల కోసం ప్రతి యేటా కేంద్రం నిధులు ఇస్తుంది
దాంతో పాటు ప్రతి యేటా సగటున 5 శాతం ఎస్కలేషన్ కూడా ఇస్తారు
ఈ నిధులు మనం మన నిధులతో కలిపి ఇన్పుట్ సబ్సిడీ లాంటి అవసరాలకు వాడతాం
కానీ 2013-14లో వాళ్లు మనకు నిధులిస్తే వాటిని మళ్లించాం
1690 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొట్టేశాం
2014-15కు 1067 కోట్ల నుంచి 692 కోట్లకు తగ్గించారు. అందులోనే 290 కోట్లు మాత్రమే ఇచ్చారు
విపత్తు నివారణ నిధుల నుంచి మనం 2014-15కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం
ఇక ఈ సంవత్సరం పరిస్థితి ఏంటని అడుగుతున్నాం
ఈ సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు బెల్ కొట్టి మైకు కట్ చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది

వినే ఓపిక లేకపోతే ఇక ఈ సభ ఎందుకని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేశంగా ప్రశ్నించారు.
ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను ముట్టడించారు.
అయినా స్పీకర్ మాత్రం ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు
విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యనే కాలువ శ్రీనివాసులు తన ప్రసంగాన్ని కొనసాగించారు
రాష్ట్రంలో కరువును రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ ప్రతిపక్షంపై ఆరోపించారు.

వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియంలోకి వచ్చి నినాదాలు చేయడంతో మళ్లీ వైఎస్ జగన్కు అవకాశం ఇచ్చారు

ప్రతిపక్షం నుంచి ఉన్న ఒక్క గొంతు మాట్లాడుతుంటే మధ్యలో పదేపదే అవాంతరాలు కల్పిస్తున్నారు
కేంద్రం ఇచ్చే నిధుల్లో 2014-15 సంవత్సరానికి కూడా ఈ సంవత్సరపు నిధులను ఉపయోగిస్తున్నారుఈ సమయంలో మళ్లీ స్పీకర్ కల్పించుకుంటూ కేవలం 10 నిమిషాల సమయం ఇస్తామన్నారు. ఒక నిమిషం కూడా మాట్లాడకముందే మళ్లీ మంత్రి రావెల కిశోర్ బాబు కల్పించుకుని ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుడి మీద ఒంటికాలిపై లేచారు.
Share this article :

0 comments: