ప్రత్యేక ప్యాకేజీ భిక్షతో సమానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక ప్యాకేజీ భిక్షతో సమానం

ప్రత్యేక ప్యాకేజీ భిక్షతో సమానం

Written By news on Tuesday, September 1, 2015 | 9/01/2015

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తానే మేలు జరుగుతుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక ప్యాకేజీ అనేది భిక్షతో సమానమని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ  పెద్దబాబు చంద్రబాబుకా, చినబాబు లోకేశ్ కా అని ప్రశ్నించారు.

చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. భారత దేశంలో ఇప్పటికి చాలా రాష్ట్రాలు విడిపోయాయని, రాజధానిని కూడా విడిచి వెళ్లిపోయిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే అనేక రకాలుగా మేలు జరుగుతుందన్నారు. ఏపీలో పారిశ్రామీకరణ జరగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నారు.
Share this article :

0 comments: