పామాయిల్ రైతుల్ని ఢిల్లీకి తీసుకెళ్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పామాయిల్ రైతుల్ని ఢిల్లీకి తీసుకెళ్తాం

పామాయిల్ రైతుల్ని ఢిల్లీకి తీసుకెళ్తాం

Written By news on Sunday, September 27, 2015 | 9/27/2015


పామాయిల్ రైతుల్ని ఢిల్లీకి తీసుకెళ్తాం
కేంద్ర మంత్రుల్ని కలిసి సమస్యల్ని వివరిస్తాం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి


 అశ్వారావుపేట : అధికారులు, రాజకీయ నాయకుల కుట్రలకు బలవుతున్న పామాయిల్ రైతులు నష్టాల పాలవకుండా ఉండేందుకు వారిని కేంద్రమంత్రుల వద్దకు తీసుకుని వెళతానని  వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. పామాయిల్ గెలలను దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఎంపీ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ పంటకు ఇతర రాష్ట్రాలతో సమానంగా గిట్టుబాటు ధరను, కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీని ఇవ్వాలన్నారు.

కేవలం రాజకీయాల కోసం కొందరు అశ్వారావుపేట ప్రాంతంలో  నాలుగేళ్లుగా రెండో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా కుట్రలు పన్నడం సిగ్గుచేటన్నారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అన్యాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఫ్యాక్టరీకి వెళ్లి మేనేజర్ హరినాథ్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గెలలను ఎందుకు దిగుమతి చేసుకోవట్లేదని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ఫోన్‌చేసి ఇక్కడి సమస్యను వివరించారు.
Share this article :

0 comments: