పిచ్చి తుగ్లక్ లా చంద్రబాబు పాలన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పిచ్చి తుగ్లక్ లా చంద్రబాబు పాలన

పిచ్చి తుగ్లక్ లా చంద్రబాబు పాలన

Written By news on Tuesday, September 15, 2015 | 9/15/2015


పిచ్చి తుగ్లక్ లా చంద్రబాబు పాలన
కాకినాడ : చంద్రబాబు పరిపాలన పిచ్చి తుగ్లక్ పాలనలా ఉందని వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ధైర్యముంటే నీటి సంఘాల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని అన్నారు. నీటి సంఘం ఎన్నికల్లో 75 శాతం టీడీపీపై వ్యతిరేకత రాకపోతే.. తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ఆయన సవాలు చేశారు.

సాగునీటి సంఘాల ఎన్నికలపై రైతులు న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టిసీమ పంపులు ఎక్కడున్నాయో తెలియకుండానే టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. గండేపల్లి రోడ్డు ప్రమాద ఘటనలో శవ రాజకీయాలు చేసింది ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడేనని జ్యోతుల ఆరోపించారు. పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబు కారణమనే అక్కడి మృతులకు రూ. 10 లక్షల వంతున పరిహారం ఇచ్చారన్నారు.
Share this article :

0 comments: