లండన్ లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లండన్ లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ నిరసన

లండన్ లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ నిరసన

Written By news on Sunday, September 13, 2015 | 9/13/2015


లండన్ లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ నిరసన
లండన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రిటిష్ పార్లమెంట్ ఆవరణంలో మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జిలు, ప్లకార్డలతో విన్నూత్నంగా తమ నిరసనను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారో ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలియజేయటం తమ ఉద్దేశం అని ఈ సందర్భంగా కార్యకర్తలు తెలియజేశారు. దాదాపు 3 గంటలసేపు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. యుకే లో తెలుగు వారందరూ ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంఘీభావాన్ని తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చేపట్టబోయే నిరాహార దీక్షకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యుకే, ఐరోపా వింగ్ కార్యకర్తలు, శివకుమార్ రెడ్డి చింతం, సందీప్ రెడ్డి పంగల, రవికుమార్ రెడ్డి, మోచెర్ల, ప్రదీప్ కుమార్ రెడ్డి చింతా, భగవాన్ రెడ్డి యనమల, సతీష్ వనహారం, వాసుదేవ రెడ్డి మేరెడ్డి, ఓబుల్ రెడ్డి పాతకోట, ప్రదీప్ కుమార్ రెడ్డి కత్తి, సురేష్ రెడ్డి, ముదిరెడ్డి, కోటిరెడ్డి కల్లం, మారుతీ శ్రీనివాస రెడ్డి వెన్నపూస, పేర్నిపార్థసారథి, శ్రీనివాస రెడ్డి ఊట, చెన్నకృష్ణ రెడ్డి అంబవరపు, సురేంద్రనాథ్ ఆలవల, తిరుపతి రెడ్డి తనిగుండల, రవీంద్రరెడ్డి నందివెలుగు, విజయ్ వయకుంతం, రాంబాబు బెందలం, నరేంద్ర వెండికంతం తదితరులు పాల్గొన్నారు.

Share this article :

0 comments: