సుబ్బారెడ్డి అరెస్టుకు వైఎస్సార్‌సీపీ నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుబ్బారెడ్డి అరెస్టుకు వైఎస్సార్‌సీపీ నిరసన

సుబ్బారెడ్డి అరెస్టుకు వైఎస్సార్‌సీపీ నిరసన

Written By news on Tuesday, September 15, 2015 | 9/15/2015


ఆ ఆత్మహత్యలు కనిపించవా?
- రాజకీయంగా ఎదుర్కోలేకే మంత్రి శిద్ధా కుటిల చేష్టలు
- బూచేపల్లి అరెస్టును నిరసిస్తూ రోడ్డెక్కిన విద్యార్థులు

ఒంగోలు క్రైం:
 రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిని ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఒంగోలు జిల్లా జైలు ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కళాశాలలో చదువుతున్న తాళ్లూరు మండలం కొత్తపాలేనికి చెందిన విద్యార్థిని స్వగ్రామంలోనే సొంత ఇంటిలో ఈ నెల 5న ఆత్మహత్య చేసుకుంటే కళాశాల చైర్మన్‌కు సంబంధం ఏమిటని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ప్రశ్నించారు.
 
రిషితేశ్వరి డైరీలో రాసినా.. :నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి స్వయంగా ప్రిన్స్‌పల్ పాత్రపై డైరీలో రాస్తే ఇంత వరకూ పోలీసులు అరెస్ట్ చేయలేదని,నారాయణ కాలేజీల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారంలోనూ స్పందించని ప్రభుత్వం, పోలీసులు ఇప్పుడెందుకు అతిగా స్పందిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి శిద్ధా రాఘవరావు రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సుబ్బారెడ్డి సతీమణి వెంకాయమ్మ విమర్శించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ కనిగిరి ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్‌తోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.
 
బూచేపల్లి సుబ్బారెడ్డి అరెస్టు..రిమాండ్
అద్దంకి: 
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, చీమకుర్తిలోని బీవీఎస్‌సీ ఇంజనీరింగ్ కళాశాల అధినేత బూచేపల్లి సుబ్బారెడ్డి,ఓఎస్‌డీ మాలకొండారెడ్డిలను పోలీ సులు సోమవారం ఉదయం చీమకుర్తిలో అరెస్ట్ చేసి అద్దంకి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ (పీడీఎం) కోర్టులో హాజరుపరచగా జడ్జి నాగేశ్వరరావు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించడంతో ఒంగోలు సబ్‌జైలుకు తరిలించారు.
 
అరెస్టును నిరసించిన విద్యార్థులు
చీమకుర్తి: 
బూచేపల్లి సుబ్బారెడ్డి అరెస్టును ఖండిస్తూ ఆ కళాశాల విద్యార్థులు సోమవారం రోడ్డెక్కారు. కళాశాల ఎదుట కర్నూల్‌రోడ్డుపై బైఠాయించారు. ఒంగోలు వెళ్లి కలెక్టర్‌ను కల వాలని ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కళాశాలకు నీటిని రవాణా చేసే ట్యాంకర్ డ్రైవర్ నిడమానూరు సుబ్బారావు ఉద్వేగానికిలోనై డీజిల్‌ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Share this article :

0 comments: