ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే

Written By news on Tuesday, September 15, 2015 | 9/15/2015


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే
తిరుపతి : నానాటికీ నష్టాల్లో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన వైఎస్ఆర్ సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
 • ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచడానికి ఎంతో చొరవ చూపిస్తున్న ఈప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికులకు జీతాలిచ్చే విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు పోవట్లేదు
 • 18 రోజుల పాటు సమ్మె చేస్తే తప్ప జీతాలకు దిక్కులేదు
 • ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు పెంచకుండా పాలన చేసింది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే
 • రాజశేఖరరెడ్డి, చంద్రబాబు పాలన గురించి నా కంటే మీకే బాగా తెలుసు
 • ఆర్టీసీ తన కాళ్ల మీద తాను నిలబడాలని, ఆర్టీసీని బలోపేతం చేస్తూ, కార్మికులకు మంచి జరగాలని ఆలోచించింది వైఎస్ఆర్
 • చంద్రబాబు హయాంలో ఆర్టీసీ బస్సులన్నీ ప్రభుత్వ కార్యక్రమాలకు తరలిపోతున్నాయి
 • నష్టాల్లో మునిగితే మరీ మంచిది, అమ్మేయొచ్చని చంద్రబాబు అనుకుంటున్నారు
 • వైఎస్ఆర్ మాత్రం 280 కోట్ల రూపాయల మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు
 • ఏ సమ్మె లేకుండా, ఎవరూ అడగకుండానే కార్మికుల ప్రతినిధులు రాగానే వెంటనే జీతాలు పెంచిన ఘనత రాజశేఖరరెడ్డిది
 • 24 రోజుల పాటు మీరు సమ్మె చేస్తే.. 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని అగ్రిమెంటు రాసుకుని కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
 • అదే రాజశేఖరరెడ్డి గారు మాత్రం కేవలం మజ్దూర్ యూనియన్ నేతలు అడగగానే ఆ రాయితీలకు సంబంధించి వంద శాతం ప్రభుత్వమే ఇస్తుందని ఆరోజు చెప్పారు
 • ఔట్ సోర్సింగ్ కార్మికుల పొట్టగొడుతున్నారు చంద్రబాబు
 • ఒక్కటే చెబుతా..
 • రాజశేఖరరెడ్డి వారసుడిగా, ఆయన స్ఫూర్తితో చెబుతున్నా.. ఎన్నాళ్లు బతికామన్నది కాదు, బతికినంత కాలం మనం ఎలా బతికామన్నది ముఖ్యం
 • సీఎం కావాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది. కానీ, ఆ పదవి కోసం మోసాలు చేసి, అబద్ధాలు ఆడేది మాత్రం చంద్రబాబే
 • అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి కూతుర్నిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచారు
 • మనం అలా కాదు.. మాట మీద నిలబడతాం.
 • రాబోయే రోజుల్లో చంద్రబాబు మీద ఒత్తిడితెస్తాం
 • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒత్తిడి తెస్తాం
 • తర్వాత మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడైనా విలీనం చేస్తాం.
 • చెప్పడమే కాదు.. చేసి చూపిస్తాం కూడా.
Share this article :

0 comments: