'ఇది చంద్రబాబు కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ఇది చంద్రబాబు కుట్ర

'ఇది చంద్రబాబు కుట్ర

Written By news on Sunday, September 13, 2015 | 9/13/2015


'ఇది చంద్రబాబు కుట్ర'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ మండిపడింది. వైఎస్సార్ సీపీ జరపతలపెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమాన్నిఅణగదొక్కడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు విమర్శించారు.  ఏపీ ప్రత్యేక హోదాపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో ఎస్వీయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు తప్పుబట్టారు.
 
ఈ సభకు ముందుగా అనుమతి తీసుకున్నా..  ఇప్పుడు ఉన్నఫలంగా అనుమతిని నిరాకరించడం కుట్రలో ఓ భాగమేనన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రత్యేక హోదాపై ముఖాముఖి జరిగి తీరుతుందని వారు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా జరిగే సభలో వేలాది మంది విద్యార్థులు, ప్రజాసంఘాలు పాల్గొంటాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Share this article :

0 comments: