ఎవరు బాబూ.. సైకో? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎవరు బాబూ.. సైకో?

ఎవరు బాబూ.. సైకో?

Written By news on Sunday, September 6, 2015 | 9/06/2015


ఎవరు బాబూ.. సైకో?
‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిన టీడీపీనా?

♦ {పజాసమస్యలు ప్రస్తావించిన వైఎస్సార్‌సీపీనా?
♦ ఓటుకు కోట్లు ఇవ్వజూపుతూ రెడ్‌హ్యాండెడ్‌గా
    ఓ సీఎం దొరకడం దేశచరిత్రలో ఇదే  మొదటిసారి...
♦‘ఓటుకు కోట్లు’పై సమాధానం చెప్పే ధైర్యంలేని చంద్రబాబు...
     {పతిపక్ష నేతపై విమర్శలా?
♦ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజం

 సాక్షి, హైదరాబాద్ : ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి, ఏం చేయాలో పాలుపోక వైఎస్సార్‌సీపీపై, ఆ పార్టీ అధినేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంబద్ధ ప్రేలాపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేతో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడటం, ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో 22సార్లు ప్రస్తావించడాన్ని అంబటి గుర్తుచేస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకమైన నీచ చర్యలకు పాల్పడటం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమమని పేర్కొన్నారు.

ఆడియో టేపుల్లో సంభాషణ సరైనదేనని ఫోరెన్సిక్ నివేదిక కూడా ధ్రువీకరించిందన్నారు. ఓ ఎమ్మెల్యే ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోవడమూ దేశంలో ఇదే ప్రథమమని అన్నారు. ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అంశం అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చే సరికి వైఎస్సార్‌సీపీపై సైకో ముద్ర వేయడానికి ముఖ్యమంత్రి సహా టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 సైకో అంటే అర్థం తెలుసా?
 ‘‘వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా మాట్లాడే, భిన్నంగా ప్రవర్తించే వ్యక్తులను సైకో వ్యాధిగ్రస్తులుగా పిలుస్తారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ను తానే నిర్మించానని చంద్రబాబు చెబుతున్నారంటే దాన్ని ఏమంటారు? సెల్ ఫోను నేనే తెచ్చా... ప్రపంచానికి ఐటీని తానే పరిచయం చేశానంటున్నారు. ఈ మాటలు ఏ కోవకు వస్తాయి’’ అని అంబటి ప్రశ్నించారు. శాసనసభలో పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను అంబటి ప్రస్తావించారు. ‘మీ అంతు చూస్తాం... మీకు పిచ్చి పట్టింది... ఇదేమన్నా లోటస్‌పాండ్ అనుకున్నారా... మిమ్మల్ని వదిలిపెట్టం’... అంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరుష పదజాలంతో చేసిన ప్రసంగ వీడియోను అంబటి రాంబాబు మీడి యా ముందు ప్రదర్శించారు.

వీడియోతోపాటు వివిధ సందర్భాల్లో అధికారులు, వ్యక్తుల పట్ల చంద్రబాబు దురుసుగా ప్రవర్తించిన తీరు, కొందరిని కొడుతున్న ఫొటోలనూ మీడియాకు చూపిస్తూ ‘ఇలాంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబును ఏమనుకోవాలి’ అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబంలో సైకో లక్షణాలు ఉన్నాయా.. లేక జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో ఆ లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటే మంచిదన్నారు. ఇలాంటి ప్రస్తావన తెస్తున్నందుకు క్షమించాలంటూనే ‘ఇప్పుడు చంద్రబాబు తమ్ముడి పరిస్థితి ఏమిటి’ అని ప్రశ్నించారు.

 ప్రజాసమస్యలపై నిలదీసినందుకే వ్యక్తిగత ఆరోపణలు...
 ‘ఓటుకు కోట్లు’ సహా అనేక ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ సభలో చర్చకు పట్టుబడితే... ముఖ్యమంత్రి సభాప్రాంగణంలోని తన చాంబర్‌లోనే ఉండి సభలోకి వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేక, చర్చించే దమ్ములేక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై, ప్రతిపక్ష నేత  జగన్‌మోహన్‌రెడ్డిపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశాలు జరిగిన ప్రతిరోజూ సైకో, రౌడీ, క్రిమినల్ అం టూ వ్యక్తిగత ఆరోపణలు చేయడానికే పరిమితమయ్యారన్నారు. 67మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పార్టీ అధినేత, ఏకైక ప్రధానప్రతిపక్షంపై అధికార పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా..! అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ కంటే టీడీపీ అదనంగా తెచ్చుకున్న ఓట్లు కేవలం ఐదు లక్షలు మాత్రమేనని టీడీపీ నేతలకు గుర్తు చేశారు. అనేక వైఫల్యాలలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యంలేకనే వర్షాకాల సమావేశాలను కేవలం ఐదు రోజులకు పరిమితం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది మూడు నెలల కాలంలోనే పట్టిసీమ, జీవో నం. 22, పారిశ్రామిక రాయితీలు, వివిధ ప్రాజెక్టుల్లో లంచాల రూపంలో దోచుకున్న డబ్బుతో తెలంగాణ ఎమ్మెల్యేని కొనుగులు చేసే వ్యవహారంలో చంద్రబాబే స్వయంగా టెలిఫోను మాట్లాడుతూ, ఓటుకు కోట్లు ఇస్తూ ఓ ఎమ్మెల్యే ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిన విషయాలను రాష్ట్ర ప్రజలందరూ టీవీల ద్వారా చూశారన్నారు.

 కోర్టులో ఉందని సాకు చూపి..
 ‘ఓటుకు కోట్లు అంశం కోర్టులో ఉందంటూ సాకు చూపుతూ మంత్రులు ఈ అంశంపై శాసనసభలో చర్చ జరగకుండా అడ్డుపడ్డారు.. చంద్రబాబు అసలు సభకే రాకుండా తన చాంబర్‌కే పరిమితమయ్యారు...  కోర్టులో ఉన్న అంశాలకు సంబంధించి అదే మంత్రులు  వైఎస్ జగన్‌పై ఇష్టమొచ్చినట్టు ప్రతి రోజూ విమర్శలు చేశారు’ అని అంబటి ధ్వజమెత్తారు. సభలో జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించినా రెండు మూడు నిమిషాలకే అచ్చెన్నాయుడో, ఇంకో మంత్రో స్పీకర్ ద్వారా మైక్ తీసుకొని ఇష్టమొచ్చిన తీరున తమ అధినేతపై ఆరోపణలు గుప్పించడమేంటని ప్రశ్నించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సహా టీడీపీ నేతలు జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా మాట్లాడితే వైఎస్సార్‌సీపీ, రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని, పద్ధతి మార్చుకోక ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Share this article :

0 comments: