కాసేపట్లో తిరుపతికి వెళ్లనున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాసేపట్లో తిరుపతికి వెళ్లనున్న వైఎస్ జగన్

కాసేపట్లో తిరుపతికి వెళ్లనున్న వైఎస్ జగన్

Written By news on Tuesday, September 15, 2015 | 9/15/2015


కాసేపట్లో తిరుపతికి వెళ్లనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో తిరుపతికి వెళ్లనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్‌ సాగిస్తున్న సమరభేరిలో భాగంగా విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అనే అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తనపల్లె క్రాస్ వద్ద ఉన్న పీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో జరగనున్న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.

 వైఎస్.జగన్‌ ఈ రోజు ఉదయం రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో విద్యార్థులు నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో పాల్గొంటారు.
Share this article :

0 comments: