న్యూజెర్సీలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యూజెర్సీలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం

న్యూజెర్సీలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం

Written By news on Sunday, September 13, 2015 | 9/13/2015


న్యూజెర్సీలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ ఫౌండేషన్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో ఫిలడెల్ఫియా ప్రాంతంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాదాపు 500 మంది ప్రవాస భారతీయులు అక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 130 మంది రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు అన్ని వర్గాల సంక్షేమాన్ని సమంగా చూశారని శ్రీకాంత్‌రెడ్డి కొనియాడారు. అందుకే ఆయనను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మరచిపోలేకపోతున్నారన్నారు.
Share this article :

0 comments: