అప్రజాస్వామికంగా సాగునీటి సంఘాల ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్రజాస్వామికంగా సాగునీటి సంఘాల ఎన్నికలు

అప్రజాస్వామికంగా సాగునీటి సంఘాల ఎన్నికలు

Written By news on Wednesday, September 9, 2015 | 9/09/2015


అప్రజాస్వామికంగా  సాగునీటి సంఘాల ఎన్నికలు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం

 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి సం ఘాల ఎన్నికలు అప్రజాస్వామికమైన రీతిలో జరుగుతున్నాయని, ఏకాభిప్రాయం పేరుతో నీటిసంఘాలపై పచ్చచొక్కాలకే పెత్తనం కట్టబెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సాగునీటి సంఘాల సవరణ బిల్లును శుక్రవారం అసెంబ్లీలో హడావుడిగా ఆమోదింపజేసుకుని శని, ఆదివారాల్లో ఎవరూ కోర్టుకు పోకుండా చూసి సెప్టెంబర్ ఏడోతేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం అనేదంతా వ్యూహాత్మకంగా జరిగిందని విమర్శించారు.

ఇప్పటికే జన్మభూమి కమిటీలను నియమించి స్థానిక సంస్థల హక్కులను హరించిన చంద్రబాబు, ఇపుడు తాజాగా సాగునీటి సంఘాల్లో కూడా పెత్తనం కోసం అడ్డదార్లు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. నీటిపారుదల రంగంలో కీలకమైన సాగునీటి సంఘాల ఎన్నికల్లో పూర్తిగా అధికార పార్టీ పెత్తనం సాగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలైన నీరు- చెట్టు వంటి కార్యక్రమాలతోపాటుగా ప్రాజెక్టు పనులు, డిస్ట్రిబ్యూటరీ పనులు వంటివన్నీ ఈ సాగునీటి సంఘాలే చేయాలి కనుక టీడీపీ వారి నేతృత్వంలో ఇవి ఉంటే ప్రజాధనాన్ని పూర్తిగా స్వాహా చేయవచ్చనే ఎత్తుగడతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చడంలో సిద్ధహస్తుడైన బాబు వ్యూహాత్మకంగా సాగునీటి సంఘాల ఎన్నికలను కూడా ఒక పద్ధతి, పాడూ లేకుండా నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. 2003, 2007 నాటి ఓటర్ల జాబితానే నేటి ఎన్నికల నిర్వహణకు పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆక్షేపించారు. టీడీపీ ప్రభుత్వం ఈ సంఘాలను తొలుత ఏర్పాటు చేసినపుడు రహస్యబ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలను నిర్వహించగా.. ఇపుడు చేతులెత్తే ప్రక్రియ ద్వారా అని మార్పు చేసిందని... చివరకు ఇపుడది కూడా లేకుండా పోయిందని చెప్పారు. అసలిది ఎలక్షనా? సెలెక్షనా? అనేది అర్థం కాకుండా ఉందన్నారు.

చాలాచోట్ల సర్వసభ్య సమావేశాలే నిర్వహించకుండా వచ్చిన వారి పేర్లు రాసుకుని సంతకాలు చేయించుకుని జిల్లా కలెక్టర్ నిర్ణయానికి వాటిని పంపుతున్నారన్నారు. అంటే అధికారపక్షం ఎవరికి చెబితే  వారిని నియమిస్తారనేది అర్థమవుతోందని విమర్శించారు. దీనిపై న్యాయపోరాటం చేసే రైతులకు వైఎస్సార్‌సీపీ సహకరిస్తుందని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: