ప్రత్యేక హోదా గురించి చర్చ సమయంలో ఓటుకు కోట్లు అంశం సభలో చర్చకు రావడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అధికార పక్ష సభ్యులు వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దాంతో జీఎస్టీ లాంటి ముఖ్యమైన అంశాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే సమయంలో ఓటుకు కోట్లు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. వైఎస్ జగన్ ఏమన్నారంటే...
- జీఎస్టీ లాంటి అత్యంత ప్రధానమైన అంశంపై చంద్రబాబు ఎందుకు పోరాటం చేయట్లేదు?
- ఇటీవలే తెలంగాణలో ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయిన పరిస్థితుల మధ్య ఆయన ఉన్నారు. అందుకే కేంద్రంపై పోరాటం చేయలేకపోతున్నారు.
- పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా పర్సంటేజీలు తీసుకుంటూ, మట్టి నుంచి బొగ్గు దాకా కమీషన్లు తీసుకుంటున్నారు
- జీవో 21 నుంచి లైసెన్సులు ఇచ్చేవరకు, స్టీలు ధరలు తగ్గుతున్నా.. అన్ని ధరలు తగ్గుతున్నా విద్యుత్ ఉత్పత్తి ధర మాత్రం పెరుగుతూనే ఉంది
- కృష్ణపట్నంలో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 8 కోట్ల రూపాయలు ఉంది
- ఆర్టీపీపీలో ఒక మెగావాట్‌కు 6 కోట్లు ఉంది
- వీటిలో వచ్చిన మొత్తాలను లంచాలుగా తీసుకున్నారు. వాటిని ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టారు.
- 26 సార్లు మీపేరు చార్జిషీట్లో పెట్టారు.. గుర్తుంచుకోండి.
- ''మా వాళ్లు దే బ్రీఫ్డ్ మీ.. ఫర్ ఎనీ థింగ్ ఐయామ్ విత్ యూ, డోంట్ బాదర్.. వాట్ ఆర్ దే స్పోక్ వి విల్ ఆనర్''
- ఇదంతా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్లు నిర్ధారించారు
0 comments:
Post a Comment